Rajanna Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయాలు అయిన నాంపల్లి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలోని అసౌకర్యాలు భక్తులకు ఇబ్బందిగా మారాయి. ఆలయ కోనేరుతో పాటుగా పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించడం. వలన భక్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయ కోనేరు మురుగు, చెత్తతో నిండిపోయి దుర్గంధం రావడం జరుగుతుంది. గతంలో స్వామి వారి దర్శనానికి ముందుగా కోనేరులో భక్తులు స్నానం ఆచరించేవారు. ఇప్పుడు కోనేరు పరిస్థితులు దుర్గంధంగా మారడంతో అటునుంచి వెళ్ళడానికి భక్తులు సంకోచిస్తున్నారు. చెత్తా చెదారాలతో నిండిపోయి ఉన్న కోనేరును పట్టించుకునే నాధుడే కరువయ్యారని నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నటువంటి భక్తులు నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం.. కోనేరులో గానీ ధర్మగుండంలో గానీ స్నానాలు ఆచరిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవని భక్తుల ప్రగాఢ నమ్మకం. సిరిసిల్ల జిల్లాలో లక్ష్మి నరసింహస్వామి వారు పెరుమాల్లుగా నాంపల్లి గుట్టపై కొలువై ఉన్నారు. ప్రతిరోజు దూర ప్రాంతాల ప్రజలు స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో వస్తుంటారు. ఆలయంలో నిర్వహణ సరిగా లేకపోవడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోనేరులో నీరు పచ్చగా మారినీటిని తాకితే రోగాలు వచ్చేలా పాచిపేరుకుపోయింది.
వెంటనే అధికారులు స్పందించి కోనేరును శుభ్రం చేపించిన తరువాత భక్తులను తీసుకురావాలని కోరుతున్నారు. ఆలయంలో అరకొరా సౌకర్యాలు: రాజన్న క్షేత్రంతో పాటు నాంపల్లి (12) లక్ష్మి నరసింహస్వామి వారికి ప్రతి ఏడాది. కోట్ల ఆదాయం వస్తున్నా అభివృద్ధి చేయడంలో మాత్రం ఈ ఆలయాన్ని విస్మరిస్తున్నారు. కేవలం కనీసం భక్తుల కొరకు మంచి నీరు, మూత్రశాలలు లేకపోవడం. శోచనీయం. స్వామి వారిని దర్శించుకున్న తరువాత భక్తులు ఇక్కడే వంటలు చేసుకుంటారు. ఆలయ పరిసరాల్లో సరైన సౌకర్యాలు లేదని, చెట్ల కిందనే వంట చేసుకోవాల్సివస్తుందని చాలా ఇబ్బందులకు గురువతున్నట్లు భక్తులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి భక్తుల కొరకు వంటగదులను, ఎండావానల నుండి రక్షణగా షెల్టర్స్ను ఏర్పాటు చేయాల్సిందిగా స్వామి భక్తులు కోరుతున్నారు.