Financial Problems : ఈ పూజ తో మీ ఆర్థిక సమస్యలు అన్ని తొలగినట్టే..!!

Financial Problems : విష్ణుమూర్తి యొక్క పది అవతారాలలో నరసింహ స్వామి అవతారం నాల్గవది. నరసింహ స్వామి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు ఆవిర్భవించాడు. పూర్వం వైకుంఠ ద్వారపాలకులైన జయ – విజయలు..బ్రహ్మ మానస పుత్రులైన సనకసనందులు శాపం ఫలితంగా హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపుడు అనే రాక్షసులుగా పుడతారు. విష్ణుమూర్తి.. వరాహ అవతారం లో హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి చంపేస్తాడు. తన సోదరుడుని చంపడం వల్ల హిరణ్యకశిపుని కి విష్ణుమూర్తి పైన కోపం వచ్చి బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై హిరణ్యకశ్యపునికి వరం కోరుకోమని చెప్తాడు.

అప్పుడు హిరణ్యకశ్యపుడు మనుషుల వల్ల గానీ,జంతువుల వల్ల గాని, రాత్రిపూట గాని, పగలు గాని, ప్రాణాలతో ఉన్న వారు గాని, ప్రాణాలతో లేనివారు గాని, భూమి పైన కానీ, ఆకాశంలో కానీ ఎవరైనా సరే తనను చంపడానికి వీలు కాకుండా వరం ఇమ్మని అడుగుతాడు. అపుడు బ్రహ్మ వరం ఇస్తాడు.హిరణ్యకశ్యపుడు తపస్సులో ఉండగా , దేవేంద్రుడు హిరణ్యకశ్యపుడి భార్య గర్భవతి అయిన లీలావతి ని అపహారిస్తుంటే, నారదడు అడ్డుపడి రక్షించి,తన ఆశ్రమానికి తీసుకు వెళ్లి, కడుపులో ఉన్న ప్రహ్లాదుడికి నారాయణ మంత్రాన్ని బోధిస్తాడు. హిరణ్యకశ్యపుడు తపస్సు నుండి తిరిగి వస్తూ నారద ముని కి తన భార్యను కాపాడినందుకు కృతజ్ఞత చెప్పి తన ఇంటికి తీసుకువస్తాడు. తనకు పుట్టిన కుమారునికి ‘ప్రహల్లాదుడు’ అనే పేరు పెడతాడు. ప్రహ్లాదుడు పుట్టిన కొన్ని రోజుల తర్వాత తనని విద్య నేర్చుకోవడానికి గురువులు అయిన చండమార్కుడు అనే గురువు వద్ద చేర్చారు.

This Pooja To Remove Financial Problems
This Pooja To Remove Financial Problems

హిరణ్యకశ్యపుడు వర బలంతో ప్రజలను, దేవతలను,మునులను హింసించసాగాడు. రాను రాను అతడిలో విష్ణుమూర్తి పైన ద్వేషం పెంచుకున్నాడు.ప్రహ్లాదుడు నిరంతరం శ్రీహరి నామం జపిస్తూ ఉండేవాడు. దీనితో హిరణ్యకశ్యపునికి కోపం వచ్చి ప్రహ్లాదుని హరినామం పలకడం మానేయమన్నాడు. ప్రహ్లాదుడు శ్రీహరి ప్రతి ప్రాణి లోనూ, ప్రతి చోటా ఉంటాడని చెబుతాడు. హిరణ్యకశ్యపుడు కి ప్రహ్లాదుడు నారాయణ నామం పలకకుండా చిత్రహింసలకు గురి చేస్తాడు. అయినా ప్రహ్లాదుడు హరి నామం చేస్తూ ఆ శిక్షలన్ని ఆనందంగా అనుభవిస్తాడు. ప్రహ్లాదుడుని నారాయణుడు ఎక్కడున్నాడో చూపించమని అడిగితే హరి “ఇందులేడు నందు కలడని సందేహం వలదు ఎందెందు వెతికినా అందందే కలడు”.

అని ప్రహల్లదుడు సమాధానం చెప్తాడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు అయితే ఈ స్తంభంలో నీ ‘నారాయణుడు’ ఉన్నాడా అని స్తంభమును గద తో కొడతాడు. ఆ స్తంభము నుండి విష్ణుమూర్తి నరసింహ స్వామి అవతారం లో ఆవిర్భవించి హిరణ్యకశ్యపుని తన తొడల పైన పెట్టి పొట్టను చీల్చుతూ చంపి వేస్తాడు. ఈ విధంగా నరసింహ స్వామి ఆవిర్భావం జరుగుతుంది.ఇక నరసింహ స్వామి సాయంత్రం వేళ ఆవిర్భవించడం తో నరసింహ స్వామి జయంతి రోజు సాయంత్రం వేళలో పూజలను చేయడం వలన సకల పీడలు తొలగి సర్వ ఆరోగ్యాలను పొందవచ్చు. అంతేకాదు ఆర్థిక కష్టంతో ఇబ్బందిపడేవారు స్వామి వారిని ఇలా సాయంత్రం సమయంలో పూజ చేస్తే తప్పకుండా ఆర్థిక సంపద పెరుగుతుంది అని .. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.