Pacha Karpuram : పచ్చ కర్పూరంతో ధన ఆదాయం పెరుగుతుందని మీకు తెలుసా.. పసుపు వస్త్రంలో పచ్చ కర్పూరాన్ని ఉంచి , మూటలో కట్టి కుబేర దిశలో ఉంచితే.. సకల సంపదలు మీ సొంతం అవుతాయి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే పచ్చ కర్పూరం తో ఇలా చేస్తే చాలు అని అంటున్నారు. పచ్చ కర్పూరానికి శ్రీ లక్ష్మి కి మధ్య గల సంబంధం ఏమిటి.. ఇప్పుడు అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.
రోజు నిష్టతో పచ్చ కర్పూరాన్ని ఉంచిన పసుపు వస్త్రానికి.. ధూప దీపాలను వేయడం ద్వారా ఆర్థికంగా ఉండే సమస్యలు ఇట్టే తొలగిపోతాయని.. చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు. పచ్చ కర్పూరం వల్ల ధనాదాయం పెరుగుతుందట. ఒక పసుపు వస్త్రంలో పచ్చ కర్పూరాన్ని ఉంచి.. దానిని మూటలో కట్టి దానిని కుబేర దిశలో ఉంచాలి . ప్రతిరోజు నిష్ఠతో పచ్చకర్పూరాన్ని ఉంచిన.. పసుపు వస్త్రానికి పూజలు చేయాలి. పచ్చ కర్పూరాని కి ఆరోగ్యానికి మేలు చేసే గుణం కూడా ఉందని తెలియజేస్తున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.

ఈ పచ్చ కర్పూరం యొక్క వాసనను పీలిస్తే చాలా మేలట.. అంతేకాకుండా చిన్నపాటి పచ్చకర్పూరాన్ని తీసుకొని.. నీటిలో వేసి ఆ నీటిని తీసుకోవడం వల్ల, ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ పచ్చ కర్పూరాన్ని పూజగదిలో ఉంచడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తుందట. పచ్చ కర్పూరాన్ని కి సంపదను ఆకర్షించే శక్తి ఉంది. తద్వారా ప్రతికూలతలు అనేవి ఉండవు. వ్యాపారంలో రాణించాలంటే.. పచ్చ కర్పూరాన్ని డబ్బులు ఉండే పెట్టె లో ఉంచడం మంచిది. ఇంట్లో దృష్టశక్తులు తొలగించాలంటే. పచ్చ కర్పూరాన్ని పూజ గదిలో ఉంచడం వంటివి చేయాలని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.