Akshara Trutiya: అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే..??

Akshara Trutiya: అక్షయ తృతీయ రోజు ఏ వస్తువైనా సరే అక్షయం అవుతుంది అని పెద్దల నమ్మకం. అంటే ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజు డబ్బులు లేని వాళ్లు కూడా అప్పు చేసి మరీ బంగారం , విలువైన వస్తువులు వంటివి కొనుగోలు చేస్తారు. పైగా ఆ రోజు బంగారం ఎంత రేటు లో ఉన్నా సరే వెనుకాడకుండా ప్రజలు కొనుగోలు చేస్తారు. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం చేయడం వల్ల మీ బంగారు రెట్టింపు అవుతుందని నమ్మకం. అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువుకు,  లక్ష్మీదేవికి పూజలు చేసి పుణ్యం సంపాదించుకుంటారు. అంతేకాదు ఏదైనా మంచి పని చేపట్టడానికి కూడా ఆ రోజు శుభ సమయం గా ఉంచుకోవడం గమనార్హం. కేవలం శుభకార్యాలకు మాత్రమే కాదు వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా మంచి రోజుగా పరిగణిస్తారు.

On the third day of Akshaya.. Lakshmidevi should get the blessing .. ??
On the third day of Akshaya.. Lakshmidevi should get the blessing .. ??
On the third day of Akshaya.. Lakshmidevi should get the blessing .. ??
On the third day of Akshaya.. Lakshmidevi should get the blessing .. ??

అక్షయ తృతీయ రోజు ఏవైనా ధాన్యం కానీ జొన్నలు కానీ కొనుగోలు చేసి విష్ణువు సమర్పించి,  ఆ తర్వాత ఎర్రటి వస్త్రంలో చుట్టి వాటిని భద్రపరుచుకోవాలి. అలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీకటాక్షం కలుగుతుంది. ఇక ధాన్యం వృద్ధి చెందుతుంది. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే.. గవ్వలు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. అందుకే ఆరోజు గవ్వలు కొన్ని లక్ష్మీ దేవి పాదాల వద్ద సమర్పిస్తే అంతా మంచి జరుగుతుంది. ఇక ఆచార వ్యవహారాల ప్రకారం పూజలు చేసి మరుసటి రోజు ఆ గవ్వలను ఎర్రటి వస్త్రంలో చుట్టి ఇంట్లో పవిత్రమైన ప్రదేశం లో భద్రపరచాలి. ఇలా చేయడం వల్ల త్వరగా లక్ష్మీకటాక్షం పొందవచ్చు.

ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖం కొనుగోలు చేసి ఇంట్లో భద్రపరిచి నట్లయితే సుఖ శాంతులు కలుగుతాయి. సులభంగా దొరికే గవ్వలతో,  ధాన్యం,  జొన్నలతో ఇలా చేయమని మీ బంధువులకు స్నేహితులకు కూడా వాట్స్అప్ ద్వారా ఈ విషయాన్ని తెలియ జేయండి. అక్షయతృతీయ రోజు ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు.