Vastu Shastra : డబ్బు సంపాదించడానికి కేవలం కష్టపడితే సరిపోదు అందుకు తగ్గట్టుగా అదృష్టం కూడా ఉండాలి. మనకు అలాంటి అదృష్టాలు వాస్తు శాస్త్రాన్ని ఫాలో అయినప్పుడు కలిసి వస్తాయిని అని చెబుతారు. ముఖ్యంగా కెరియర్ లో కూడా ముఖ్యమైన మైలురాళ్లను పూర్తి చేయాలి అంటే హార్డ్ వర్క్ కూడా చాలా అవసరం. వాస్తు శాస్త్రం ప్రకారం దిశ అనేది ముఖ్యమైన భాగం. వాస్తు శాస్త్రంలో చెప్పబడిన కొన్ని పరిష్కారాలు వల్ల మీ కెరియర్ అభివృద్ధిని వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. హిందూ పురాణాలలో వాస్తు శాస్త్రానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మించేటప్పుడు లేదా ఆఫీస్ ని నిర్మించేటప్పుడు తప్పకుండా వాస్తు ప్రకారమే నిర్మిస్తారు. అంతేకాదు వాస్తు ఎలా ఉండాలి..? ఏ దిశలో ఉండాలి..?
ఇలా అన్ని విషయాలు కూడా సమకూర్చిన తర్వాతనే మనం కూడా ముందుకు వెళతాము.శాస్త్రం ప్రకారం మనం కనుక ఆఫీస్ లేదా ఇంటిని నిర్మించుకున్నట్లయితే ఆనందం, శాంతి వృద్ధి, శ్రేయస్సు అన్నీ పెరుగుతాయి. ఎలాంటి చిట్కాలు పాటించడం వల్ల మన కెరియర్ లో ఎదుగుదల ఉంటుంది .. ఆర్థిక సంపద కూడా పెరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.ఆఫీస్ లో పని చేస్తున్నట్లు అయితే కాలు వేసుకుని కూర్చునే అలవాటు మీకు ఉంటే వెంటనే మార్చుకోండి. కెరియర్ ఎదుగుదల విషయంలో ఈ అలవాటు అడ్డంకిగా మారుతుంది . అంతేకాదు కార్యాలయంలో పని చేసేటప్పుడు ఎత్తైన కుర్చీలో కూర్చోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంటి నుంచి పని చేసే వారికి కూడా ఈ నియమాలు వర్తిస్తాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించడం వల్ల జ్ఞాపక శక్తి కూడా అభివృద్ధి చెందుతుంది. అంతే కాదు మీలో ఏకాగ్రత పెంచడంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఉత్తరాభిముఖంగా కూర్చుని పని చేయాలి.. పని చేసేటప్పుడు మీ వెనుక బలమైన గోడ ఉండాలి కానీ కిటికీ ఉండకూడదు.ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల పై మీరు పనిచేస్తున్నట్లు అయితే మీరు ఉపయోగించే టేబుల్ కూడా దీర్ఘచతురస్రాకారం లేదా చతురస్రాకారంలో ఉండే టేబుల్ మాత్రమే ఉపయోగించండి. రౌండ్ టేబుల్ పై పని చేయడం మానుకోవాలి. అలాగే టేబుల్ పైన వెదురు మొక్కలు పెంచుకోవడం వల్ల మీ కెరియర్ మరింత అభివృద్ధి చెందుతుంది అని.. ఆర్థిక సంపద పెరుగుతుంది అని వాస్తు శాస్త్రం చెబుతోంది.