Shani Dosha : ఎవరికైనా జీవితంలో కష్టసుఖాలు అనేవి సర్వసాధారణం. కానీ కొంతమంది కి ఎప్పుడు చూసిన కష్టాలమయంగానే ఉంటుంది. దానికి కారణం మన జాతకంలో వున్న శనిదోషాలు వల్ల అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.అలాంటి వారు శని దోషాలు తొలగించడం కోసం శనివారం పూట కొన్ని వస్తువులను దానం చేయటం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం… కొంతమంది ఎంత సంపాదిస్తున్నా కూడా శని ప్రభావం వల్ల చేతిలో ఒక్కరూపాయి కూడా లేకుండా.. ఇలా డబ్బు వస్తూనే అలా మంచి నీళ్లలా ఖర్చుయిపోతుంటుంది. దీనికి కారణం శని.. మనజాతకంలో నలుమూలలా వున్నాడనీ అర్థం.శనిబాధల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని పూజలు చెయ్యాలి..కొన్నిటిని దానం చెయ్యాలి.
ముఖ్యంగా నేరేడు పండ్లను, మరియు నల్లనువ్వులను దానం చెయ్యడం వల్ల శని బాధలతో పాటు ఆరోగ్య సమస్యల నుంచీ కూడా మంచి పరిష్కారం దొరుకుతుందని పండితులు చెబుతున్నారు. సుఖసంతోషాలకు కారణం కేవలం డబ్బు మాత్రమే కాదు ఇంట్లో ఆయురారోగ్యాలు కూడా ఉంటేనే మనుషులకు మనశ్శాంతి గా ఉంటుంది. కొన్ని ఇళ్లలో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. దానికి కారకుడైన శని జాతకంలో అనుకూలంగా లేని వారి ఇమ్యూనిటీ పవర్ తగ్గించి ప్రతి చిన్న జబ్బుకు ఎక్కువ కాలం బాధను అనుభవించేటట్లు చేస్తాడు. దీని నివారణకు నేరేడు పండ్లను శనివారం పూట వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టి పూజించి.. దానం చేసి మిగిలినవి రోగాలతో బాధపడేవారు తింటే వాటి వలన రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధి తీవ్రత తగ్గుతుంది. నేరేడులో పీచు పదార్థాము ఎక్కువగా ఉండడం వల్ల మూత్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కానీ గర్భిణీలు వీటిని తినకూడదు . ఈ నేరేడు పండ్లను శనివారం పూట తీసుకోవడం ద్వారా షుగర్ దరిచేరదు. అలాగే కడుపులో వెంట్రుకలు, మలినాలు, నులి పురుగులు తొలగిపోతాయి. శరీరానికి ఇవి చలవ చేస్తాయి. దేవునికి నువ్వులు బెల్లం కలిపిన చలిమిడిని నైవేద్యంగా పెట్టి మనము ప్రసాదంగా తీసుకుంటే మనకు బాగా నీరసం, నిస్సత్తువ తగ్గిపోతుంది. ఆడవారికి నెలసరి క్రమం తప్పకుండా వస్తాయి.సర్వరోగాలు తగ్గి ఆరోగ్యవంతులవుతారు. నేరేడు పండ్లను శనివారం శనీశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకుంటే నడుం నొప్పి, మోకాళ్ల నొప్పి తగ్గిపోతాయి. నల్ల నేరుడును, నువ్వులతో కలిపి శనివారం దానం చేస్తే.. శనిబాధలు తొలగిపోతాయి. ఇంట్లో దరిద్రాల కారణం గా వచ్చే కష్టాలు, నష్టాలు తొలగి సర్వ సంపదలు, సుఖసంతోషాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు ఉద్గటిస్తున్నారు