Bhagavad Gita : ఈ సైకాలజీస్ట్ లు చెప్పే మైండ్ కంట్రోలింగ్ టెక్నిక్స్.. భగవద్గీత లో శ్రీకృష్ణుడు ముందే చెప్పాడా..?

Bhagavad Gita : మన మనస్సును నియంత్రించడం గురించి భగవద్గీతలో అద్భుతమైన ప్రయోగాలు చెప్పబడినాయి. అలాగే మనస్సు కూడా పాజిటివ్ లేదా నెగిటివ్ గా మారగలదు పాజిటివ్,నెగిటివ్ శక్తి గా పనిచేస్తుంది.మన మనస్సు పాజిటివ్ గా వున్నప్పుడు మన జీవితాన్ని అత్యుత్తమంగా..ఆనందకరంగా మారిస్తే.. నెగిటివ్ గా మారినప్పుడు అధోగతి ని, అశాంతిని, అపజయాలను కలిగిస్తుందని .. అప్పుడు మనస్సు ను అదుపులోపెట్టుకోవడం వల్ల వచ్చే ఉపయోగాల గురించి భగవద్గీతలో 6 వ అధ్యాయం 34,35 శ్లోకాలలో అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు కి మధ్య ఆసక్తికరమైన అద్భుతమైన సంభాషణను పద్య రూపంలో వివరించారు. యుద్ధరంగంలో సర్వ శక్తులను కలిగి ఉన్నప్పటికీ అన్ని రకాల ఆయుధాలు, అస్త్రాలు , సైన్యం కలిగి ఉన్నప్పటికీ మనస్సులో బలహీనంగా,దుఃఖంగా చంచలంగా, భయంగా వుందని అర్జునుడు కృష్ణుడి ని సూటిగా తన మానసిక బలహీనత గురించి అడుగుతాడు.తన మానసిక బలహీనత నిర్భలత్వం నుంచి బయటపడేందుకు ఉపాయాలను చెప్పమని అడిగాడు.కృష్ణా మనస్సు అతి చంచలంగా ఉంది. అవయవాలను శోభకు గురిచేస్తోంది.మనస్సులో ప్రాపంచిక విషయాల నుంచి మల్లించడం అత్యంత కఠినంగా అనిపిస్తోంది.మనసును బందించడమంటే గాలిని బందించినంత కష్టంగా ఉంది.

దీన్నుంచి బయట పడే ఉపాయలు చెప్పు మాధవ..! అని అర్జునుడు కృష్ణుడు ముందు ప్రాధేయపడతాడు.ఇలా అర్జునుడు తన మనసులో ఉన్న ఇటువంటి సమస్యలను స్పష్టంగా చెప్పిన తర్వాత కృష్ణుడు వాటిని ఒక్కొక్కటిగా జవాబురూపంలో పరిస్కారాలు చూపిస్తాడు. శిక్షణలో సర్వోత్తముడు,సర్వోన్నతుడు గా ఉండే కృష్ణుడు అర్జునుడి యొక్క ఒక్కొక్క ప్రశ్నను గౌరవిస్తూనే మంచి పరిష్కారం వైపు అర్జునుడిని నడిపిస్తాడు. అప్పుడు అర్జునితో ఇలా అంటాడు.. మనసు నిగ్రహం అనేది చాలా కష్టమే అని .. నేను కూడా అంగీకరిస్తున్నాను.. కానీ అది ఎంత కష్టమైనప్పటికీ అభ్యాసం ద్వారా అసాధ్యం మాత్రం కాదు. నియంత్రణ గురించిన రహస్యాలను ఆరో అధ్యాయంలో 35 వ శ్లోకంలో ఇలా చెప్పుకొస్తాడు.మహా బాహు అర్జునా మనస్సు చంచలమైనది.. నియంత్రించడం కష్టమైనదే.కానీ అభ్యసించడం ద్వారా మనసును కచ్చితంగా నువ్వు వశం చేసుకోగలవు. అంటే ధ్యానాన్ని అభ్యసించడం ఒకటి, అనవసరమైన లౌకిక విషయాల పై ఆసక్తిని ప్రదర్శించటం రెండోది. ఇలా ఈ రెండు ఉపాయాల ద్వారా ఖచ్చితంగా మనసుని అదుపులో చేసుకోవటం సాధ్యం అవుతుంది అని అర్జునుడికి చాలా స్పష్టంగా బోధించడం జరిగింది.

ధ్యానం మరియు అనాసక్తి యొక్క ప్రదర్శన రెండు ఉపాయలను గురించి మరింత విశదీకరించండి అని అర్జునుడు కోరినప్పుడు, కృష్ణుడు ఇలా ఒక్కొక్క దాని గురించి ఇలా చెప్పారు. ధ్యానం అంటే పాజిటివ్ ఆలోచనలు.. పాజిటివ్ భావాలను కలిగి ఉండటం. వైరాగ్యం అనేది ధ్యానం యొక్క అభ్యాసం లో భాగం అవుతుంది. ఇక రెండవది ఇతరుల మీద ఆసక్తిని తొలగించడం అంటే మనకు సంబంధం లేని, మనకు ప్రమేయం లేని, మనకు బాధ్యత లేని,మన పరిధిలో లేని విషయాల మీద కావాలనే ఆలోచించడం తగ్గిస్తూ నిదానంగా వాటి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం అనేది అనాసక్తి ప్రదర్శన లేదా దీన్ని సాధువులా భాషలో వైరాగ్యం అని కూడా అంటారు. వైరాగ్యం అనే పదానికి సాంసారిక విషయాల్లో కొంచెం నెగిటివ్ సెన్స్ వచ్చే విధంగా ఉపయోగిస్తున్నారు. అంతా వైరాగ్యం అనే పదాన్ని అనాసక్తి రూపంలోకి ఆధునిక మైనటువంటి సైకాలజిస్టు మార్చేశారు. కాబట్టి అభ్యాసం ఒక ఉపాయం అయితే అనాసక్తి అనేది రెండు పాయలుగా ఇప్పుడు మనకు చెబుతున్నారు.

In the Bhagavad Gita Lord Krishna Hasa Said Before
In the Bhagavad Gita Lord Krishna Hasa Said Before

కొంచెం వివరంగా ధ్యాన అభ్యాసం ఒకటి,రెండోది అనాసక్తిని ఏ రకంగా అభ్యాసం సాధన చేయాలి. ఇందులో ముఖ్యంగా ధ్యానం అభ్యాసం ఎలా చేయాలి అన్నప్పుడు మనసుని ఒక చోట స్థిరంగా నిలబడి అంటే ముఖ్యమైన విశ్వశక్తి స్వరూపాన్ని ధ్యానించాలని మనసులో నీ మనసుని మళ్లించి ఈశ్వరుని యొక్క మహాశక్తి పై నిలవటానికి నిరంతరం ధ్యాన అభ్యాసం చేస్తూ చేస్తూ 1వ రోజు నుంచి నిదానంగా ఒక్క నిమిషం చేస్తూ ఉన్నట్లయితే పాజిటివ్ ఎనర్జీ మనసుకి ఒక బలాన్ని మనస్సు యొక్క నియంత్రణలో ఒకే విషయం మీద ఏకాగ్రంగా నిలవటం అనే ఒక సాధన అలవడుతుంది.కాబట్టి అభ్యసనం అనేది ఒక ముఖ్యమైన ఉపయోగం. ఇక రెండోది ఇతరుల మీద అనాసక్తిని ఎలా ప్రదర్శించాలి అనేది ఒక మంచి బ్యాలెన్సింగ్ టెక్నిక్ గా స్పష్టంగా చెప్పడం జరిగింది.దీన్ని మనకు మన శక్తిసామర్థ్యం మించి కోరుకోవడంమే ఇతరులపై ఆసక్తి కలిగివుండడం అని సైకాలజిస్ట్లు చెబుతుంటారు.అంటే అంతులేని ఆశలు కోరికలు వెనుక మనస్సును పరగెడుతూ ఉంటే అనేక కారణాలతో అనేక రకాల సమస్యలు బలహీనతలు ఉత్పన్నమవుతుంటాయి. …