Lakshmi Devi : ముఖ్యంగా ఏ ఒక్క మనిషి అయినా సరే ఉన్నత స్థానానికి చేరుకోవాలి అంటే ప్రతిభ మాత్రమే సరిపోదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించాలి.. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎంత దరిద్రులైనా సరే కోటీశ్వరుల అవుతారనటంలో సందేహం లేదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే వాస్తు శాస్త్రం నమ్మేవారికి లక్ష్మీదేవిని ఎలా అనుగ్రహం చేసుకోవాలో బాగా తెలిసిన పండితులు చెబుతున్నారు. ఎందుకంటే వీరు వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా వాస్తు ప్రకారం ప్రతి వస్తువును ఇంట్లో అమర్చుతారు. అలా అమర్చడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం పొందే అవకాశం ఉంటుందట.
మరి ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. మనీ ఫ్రాగ్ : మూడు కాళ్ల టోడ్ లేదా ఫెంగ్ షుయ్ మనీ ఫ్రాగ్ అదృష్టాన్ని తీసుకొస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టుకోవాలి. ఇక డబ్బులు దాచే గదిలో కూడా పెట్టుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా వంటగది, వాష్ రూమ్స్ లాంటి ప్రదేశాలలో ఈ విగ్రహాన్ని పెట్టకూడదు లేకపోతే సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. ముఖ్యంగా ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కప్పలు ఉంచాలనుకుంటే వాటి సంఖ్య 3,6 , 9 ఇలా బేసి సంఖ్యలో ఉండే సంఖ్యలో మాత్రమే తీసుకోవాలి. అంతేకాదు దీనిని నేలపై ఉంచకుండా కొంచెం ఎత్తులో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు వరిస్తుంది. లాఫింగ్ బుద్ధ : సంపదకు మారుపేరుగా చెప్పవచ్చు.. ఇకపోతే చైనా వినాయకుడిగా పిలిచే లాఫింగ్ బుద్ధ కూడా ఇంటి గుమ్మంలోనే ఉంచాలి.
ముఖ్యంగా లాఫింగ్ బుద్ధ ముఖంలో ఉంటే పెద్ద చిరునవ్వు నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి శుభాన్ని ఆహ్వానిస్తుంది అని చెబుతారు అందుకే లాఫింగ్ బుద్ధ ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం, ఆనందం రెండూ కూడా ఉంటాయని చెబుతారు. అందుకే ఇంట్లో, కార్యాలయాల్లో, వ్యాపార సంస్థలలో కూడా లాఫింగ్ బుద్ధును పెట్టుకుంటారు. అలా పెడితే అంతా శుభం కలిసి వస్తుందని అందరి నమ్మకం. గోల్డెన్ ఫిష్ : గోల్డెన్ ఫిష్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆనందానికి, సామరస్యానికి ప్రతీకగా నమ్ముతారు. విద్య , ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతంగా అభివృద్ధి చెందుతారట. అందుకే ఈ చేపను డ్రాయింగ్ రూమ్లో పెట్టుకుంటే మరీ మంచిది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో మీరు ఈ విగ్రహాన్ని పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు ఈ చేపను తాకినట్లయితే మీకు సక్సెస్ రావడం మీరే గమనించవచ్చు.