Vastu Dosha : వాస్తు దోషా లేకుండా ఇంట్లో సుఖసంతోషాలు కలగాలంటే

Vastu Dosha : వాస్తు దోషాలు లేకుండా ఇంట్లో సుఖసంతోషాలు కలగాలంటే కొన్ని వాస్తు పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ఇక ఇలా ఇంట్లో ఉన్న వారు ఎప్పుడు ఆనందంగా , సంతోషంగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులను మీ ఇంట్లో ఉంచినట్లయితే తప్పకుండా ఆర్థిక సంపద పెరుగుతుంది. ఇక సంపదను పెంచే ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకోబోయే ముందు ఈ ఆర్టికల్ ను ప్రతి ఒక్కరికి వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.

1. శంఖు పుష్పం : ప్రతి సోమవారం లేదా శనివారం ఒక కుండలో మూడు శంకు పుష్పాలను వేయాలి. అందులో నీరు ఉండేలాగా చూడాలి .ఇలా చేయడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు .ఈ విధానాన్ని మీరు మూడు వారాలపాటు కొనసాగించినట్లయితే ఆర్థిక సంపదకు ద్వారం తెరుచుకుంటుంది.

If you want to enjoy happiness at home without Vastu Dosha
If you want to enjoy happiness at home without Vastu Dosha

2. విండ్ చిమ్ : గాలి వీచి నప్పుడల్లా వీటినుంచి వచ్చే మధురమైన ధ్వని ఇంట్లో సానుకూల శక్తిని పెంపొందిస్తుంది. ముఖ్యంగా మన విధి పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని చెప్పవచ్చు. ఇక ఇలాంటివి ఇంటి నిర్మాణ లోపాలను కూడా సాధ్యమైనంత వరకు తొలగిస్తాయి. వీటి నుంచి వచ్చే శబ్దం వినడానికి వినసొంపుగా ఉండడంతో పాటు ఎన్నో కష్టాలను తొలగించుకోవచ్చు.

3. గుర్రపు నాడ : పురాతన శాస్త్రం నుంచి గుర్రపు నాడ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక గుర్రపు నాడ కి పసుపురాసి.. కుంకుమ బొట్టు పెట్టి.. గడపకు మధ్యలో కొట్టడం వల్ల ఆ ఇల్లు ఎప్పుడూ ప్రతికూల శక్తుల నుండి రక్షణ చేయబడుతుంది . ఇక ఇంట్లో సంతోషం కలుగుతుంది. ముఖ్యంగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

4. క్రాసులా చెట్టు : ఇంటి ఉత్తరం వైపు ఈ మొక్క ఉండడం వల్ల డబ్బుకు ఏమాత్రం కొరత ఉండదు .ఈ మొక్క అయస్కాంతంలా డబ్బును ఆకర్షిస్తుంది. ఇక ఈ మొక్క పెరిగే కొద్ది మీ ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది.