Lakshmi Devi : ప్రతి ఒక్కరి ఇంట్లో రాగి చెంబు ఉండనే ఉంటుంది.. అయితే ఇలాంటి రాగి చెంబును మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటాము..ముఖ్యంగా లక్ష్మీ దేవి కటాక్షం పొందాలంటే రాగి చెబుతో ఇలా చేయాలని కొంతమంది పండితులకు తెలియ జేయడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.ఐశ్వర్యం అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు.. ఐశ్వర్యం అంటే డబ్బు మాత్రమే కాదు డబ్బుతో పాటు.. మనకు కావలసిన అన్ని ఆనందాలు ఉండడమే. ధనం, విద్య, ఆరోగ్యం, సౌభాగ్యం , పేరు ప్రతిష్టలు , వంటివి అన్నీ మనకు కావలసినవి.
అయితే ఇలాంటివి అన్ని కావాలంటే రాగి చెంబుతో మనం ఇలా చేస్తే చాలు.. రాగి చెంబులో కాస్త గంధం వేసి.. అందులో కొన్ని గులాబీ రేకలు వేసి.. మీ ఇంట్లో ఈశాన్యం మూల ఉంచాలి. ఇలా ప్రతి రోజు రాగి చెంబులో నీటిని పోసి, ఒక వారం రోజులపాటు చేస్తే ఆ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి.. ఆర్థిక సమస్యలు ఉన్నా.. మరే ఇతర సమస్యలు ఉన్నా తొలగిపోతాయట.ఎందుచేత అంటే రాగిచెంబు అనేది ధనాకర్షణ ను కలిగి ఉంటుందట. అలాగే రాగి చెంబులో నీటిని పోసి.. ఇంట్లో ఈశాన్యం మూల పెట్టడం వల్ల, ఆ ఇంట్లో వారి మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుందట.
ఇక రాగిచెంబులో నీటిని పోసి అందులోకి కాస్త గంధం వేసి.. బయట సింహద్వారం కుడివైపున ఈ రాగి చెంబును ఉంచితే.. మీరు లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్లు అవుతుందట. పూజ చేసేటప్పుడు రాగి చెంబులో నీటిని పోసి.. లక్ష్మీ నారాయణ పటాలము నందు లేదా లక్ష్మీదేవి పటం వద్ద గాని.. ఆ రాగి చెంబును పెట్టి.. మంగళవారం, శుక్ర వారం రోజులలో పెట్టినట్లు అయితే ఆ ఇంట సిరి సంపదలు వెదజల్లుతాయి అని కొంతమంది పండితులు తెలియజేశారు. ముఖ్యంగా రాగి చెంబులు తీసుకునేటప్పుడు ప్యూర్ రాగి సొమ్మును మాత్రమే తీసుకోవాలి.