Lakshmi Devi : పంచేకొద్దీ తరిగేది డబ్బు.. ఇచ్చే కొద్దీ పెరిగేది విద్య అని అంటారు. ఇక మనం ప్రతిదీ పెంచుకుంటూ పోతే చివరకు ఏది మిగలదు. కానీ దానం చేయడం వల్ల ధనవంతులు అవుతారు అని పండితులు కూడా చెబుతున్నారు. దానానికి, ధనానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది . మనకున్న దాంట్లో కొంత భాగం ఇతరులకు ఇస్తే వారు సంతోషపడి మనల్ని ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వాదం మనం ధనవంతులు గా మారడానికి సహాయపడుతుంది. కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మనం ధనవంతులము అవుతామని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా మీ తల రాత అనేది మీరు దానం చేసే వస్తువులను బట్టి ఉంటుంది.
పేదవాళ్లకు , ఇత్తడి వస్తువులను దానం చేయడం వల్ల పండితులు మంచి జరుగుతుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా పౌర్ణమిరోజు , ఇతడి వస్తువులను దానంగా ఇస్తే ఇంట్లో ఆహారానికి, సంపదకు ఏమాత్రం లోటు ఉండదట.ఇక మీరు దానం చేసేటప్పుడు పైన కొన్ని లవంగాలను ఉంచి దానం చేస్తే మీకు వచ్చే సంపద రెట్టింపవుతుంది. అంతేకాదు సంపాదనకు మార్గాలు ఉన్నప్పుడు ఏవైనా అడ్డంకులు కలిగితే అవి తొలగిపోతాయి.పౌర్ణమి రోజున వెండి నాణేలను లేదా వెండి వస్తువులను అత్యంత కటిక బీదవానికి దానం చేస్తే ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయని గ్రంథాలు కూడా చెబుతున్నాయి .

శాంతి సౌభాగ్యాలు కలుగుతాయని… ఇంట్లో యశస్సు పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా దానం ఇచ్చే వారికి మనం సంతోషంగా ఇవ్వాలి. అంతే తప్ప మొక్కుబడిగా దానం ఇవ్వడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. అయితే మీరు మనశ్శాంతి, సంతోషంతో నిండి పోయి వారికి దానం చేస్తారు . మీ దానం పొందినవారు కూడా మనశ్శాంతిగా ఉంటారు . అంతే కాదు మీరు అన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా వచ్చే ఫలితాలు కూడా పాజిటివ్ గా ఉంటాయి. మీ ఆలోచనలు ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటాయో అప్పుడు సుఖశాంతులు, సంపదలు కూడా పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.