LakshmiDevi : సర్వ సంపదలకు అధినేత అయిన మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాల కోసం ఎంతో మంది ఎదురు చూస్తూనే ఉంటారు. ఆమె దృష్టి మన మీద పడాలని ఎన్నో పూజలు, వ్రతాలు వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఆమె తృప్తి కొరకు చేయవలసిన పనులను కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1). ప్రతిరోజు రాత్రిపూట మనం భోజనం చేసిన తర్వాత..తినేసిన పాత్రలన్నింటినీ శుభ్రంగా కడిగి వేసి పడుకోవాలట. ఇలా చేయకపోతే దరిద్రం చుట్టుకుంటుందట.
2). కాశీలో అన్నపూర్ణేశ్వర ఆలయం వెలసివుంది.. ఈ ఆలయంలో ప్రసాదంగా కొన్ని బియ్యాన్ని ఇస్తారు. వాటిని తీసుకువచ్చి ఇంట్లో భద్రపరుచుకోండి. ఇలా చేయడం వల్ల మనకి ఎప్పుడూ అన్నానికి లోటు ఉండదట.

3). భోజనం తినేటప్పుడు పాత్రలన్నింటినీ వూడ్చుకొని తినకూడదు.ఇలా పాత్రలో కొద్దిగా అన్నం అయినా ఉంచితే దేవతలు, తథాస్తు దేవతలు వచ్చి ఆ అన్నాన్ని తిని.. ఆశీర్వదించి పోతారట.
4). ఎవరి ఇంట్లో అయితే ఎక్కువగా బొద్దింకలు ఉంటాయో..వారికి ఎక్కువగా ఆర్థిక నష్టం జరుగుతుంది.
5). మనం చెప్పులను ఇంటి గడపకు ఎదురుగా విడవ కూడదట. గడప అంటే లక్ష్మీ దేవి స్వరూపం అని గడప ను తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కూర్చోవడం వంటి పనులు చేయకూడదట.
6). మీ ఇంటికి మెయిన్ డోర్ గడపకు ఎర్రటి కుంకుమ తో స్వస్తిక్ గుర్తు వేయండి. అది కూడా చాలా సుఖ ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే మహిళలు ఉదయం తొందరగా లేచి వారి యొక్క కాలకృత్యాలను తీర్చుకుని.. తమ ఇంటిని శుభ్ర పరచుకోవాలి.
7). సూర్యోదయం లోపల దీప, దూప నైవేద్యాలను సమర్పించి.. లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా ఎవరైతే పూజిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందట.
8). ఏ ఒక్కరి ఇంట్లో అయినా విరిగిపోయిన వి, కుళ్లి పోయినవి, చెడిపోయిన వంటివాటిని అసలు ఉంచకూడదట.వెంటనే వాటిని బయటికి పారేయాలట.
9). పూజ చేసే సమయంలో సాంబ్రాణి ధూపం వేయడం చాలా మంచిదట.