Deepam : దీపం ఏ నూనెతో వెలిగిస్తే.. అదృష్టం వరిస్తుందో తెలుసా..?

Deepam : హిందూ సంప్రదాయం ప్రకారం సనాతన ధర్మంలో ప్రతి దేవతను పూజించాలని సాంప్రదాయం చెబుతోంది. ఇక ఆరాధన , ఆర్తి, ప్రసాదంతో ముగిస్తుంది పూజ.. ఆరతి ఆలయమైనా..ఇంట్లోనే రెండు చోట్ల దీపం వెలిగించాలనే సంప్రదాయం కూడా ఉంది. ఇంట్లో దీపం పెట్టడం వల్ల అక్కడ పెద్ద మనిషి జీవితంలో చీకటి తొలగి పోయి వెలుగు పొందుతాడు అని గ్రంథాలలో కూడా చెప్పబడింది. దీపం వ్యక్తికి సానుకూల శక్తిని కూడా అందిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. ఇక చాలాచోట్ల దేవాలయాల్లో దేవతల ముందు నూనె లేదా నెయ్యి దీపాలు వెలిగించడం మనం గమనిస్తూనే ఉంటాం.

కానీ దేవుడి ముందు నెయ్యి దీపం లేదా నూనె దీపం ఎప్పుడు వెలిగించాలి అనే విషయం తెలియక చాలామంది సతమతమవుతూ ఉంటారు.. ఇక మీకు తెలిసిన వారు కూడా ఎవరైనా ఇలాంటి సందేహంలో ఉండి ఉన్నట్లయితే వారికి ఈ ఆర్టికల్ ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.దీపం పరంజ్యోతి స్వరూపం అని అంటారు కాబట్టి దీపానికి ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. ఇలాంటి దీపాన్ని మనం ఆవు నెయ్యి లేదా ఇతర నూనెలతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. మీకు ఉన్న సందేహాన్ని తొలగించే ప్రయత్నం ఎప్పుడు చేద్దాం. నెయ్యి తో తయారుచేసిన దీపాన్ని స్వామివారికి కుడివైపున వెలిగించాలి .. అదే మీ ఎడమ చేతి వైపు అయి ఉంటుంది.

if the deepam is lit with any oil do you know if it brings good luck
if the deepam is lit with any oil do you know if it brings good luck

ఇక మరొకవైపు నూనె దీపం గురించి మాట్లాడినట్లయితే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి స్వామివారికి ఎడమవైపున అంటే మీ కుడి భుజం వైపున వెలిగించాలి.ఇక మనిషి తన కోరికను నెరవేర్చుకోవాలని అంటే అందుకు స్వామివారికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తారు. ఇక మానవులు తమ అవసరాలకు అనుగుణంగా ఒకటి లేదా రెండు దీపాలను వెలిగించవచ్చు . ఇలా చేయడం వల్ల ఇంటి వాస్తు లోనీ అగ్ని మూలకం కూడా బలపడుతుంది. ఇక దీపం వెలిగించే టప్పుడు ప్రమిద శుభ్రంగా.. ఎక్కడ పగిలిపోకుండా ఉండాలి. నెయ్యితో దీపం వెలిగించడం శుభకరం అని పండితులు. దీపం చాలాకాలంపాటు వెలిగేలా చూసుకోవాలి. ఎంత ఎక్కువ సేపు దీపం వెలిగితే ఆ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి.