పురుషులు, స్త్రీలు ఆ రోజున తలస్నానం చేస్తే దరిద్రమేనట..!!

హిందూ సంప్రదాయాల ప్రకారం మనం కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటాము.. ఇక ఇలాంటి ఆచారాలను మనం ఇప్పటికి కూడా పాటిస్తూనే ఉన్నాము.. ముఖ్యంగా ఇలాంటి వాటిలో ఏ రోజు తలస్నానం చేయాలి. చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా తల స్నానం చేసేటువంటి రోజులు ఏవి అనే విషయం కూడా తెలుసుకుందాం.అయితే తలస్నానం ఏరోజు చేయాలి.. ఏరోజు చేయకూడదు అనే విషయం కొంత మందికి మాత్రమే తెలుసు. అయితే తెలియకుండా చేసిన కొన్ని పనుల వల్ల మన తీవ్ర కష్టాలను, దరిద్రాన్ని కొనితెచ్చుకున్నట్లు ఉంటుంది.. అయితే మీకు కూడా ఇలా జరగకుండా ఉండాలి అంటే ఇది కచ్చితంగా పాటించాల్సిందే.. ముఖ్యంగా స్త్రీలు పురుషులు ఏ ఏ సమయాలలో, ఈ రోజులలో తలస్నానం చేయాలి..

Advertisement
If men and women take a bath on that day they will be poor
If men and women take a bath on that day they will be poor

మహిళలు : మహిళలు సోమవారం రోజున ఉదయమే తలస్నానం చేస్తే.. నిత్య సౌభాగ్యంతో ఉంటారట. ఈ పనిని ప్రతి సోమవారం చేసినట్లయితే మంచి అనుకూల ఫలితాలు లభిస్తాయని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఒంటికి నూనె రాసుకుని.. పసుపును పట్టించి, నలుగు పెట్టుకుని స్నానం చేస్తే మరీ మంచిదట.

Advertisement

2). ఇక అలాగే బుధవారం రోజున తలస్నానం చేస్తే భార్యాభర్తల మధ్య బంధం మరింత పెరుగుతుందట. ఇక వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు రాకుండా సుఖసంతోషాలతో ఉండారని నిపుణులు తెలుపుతున్నారు.

3). శనివారం రోజున తలస్నానం చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయట.

మహిళలు ముఖ్యంగా మంగళవారం, శుక్రవారాలలో తలస్నానం చేయకూడదట.. కేవలం మైల పడినప్పుడు మాత్రమే ఆ రోజుల్లో స్నానం చేయాలట.

పురుషులు : పురుషులు ఎప్పుడు పడితే అప్పుడు ఏ సమయంలో అంటే ఆ సమయంలో తలస్నానాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సోమవారం రోజున పురుషులు తలస్నానం చేస్తే.. వారి అందం తో పాటు, ఆయుష్షు కూడా మరింత పెరుగుతుందట. మంగళవారం రోజున తలస్నానం చేయడం వల్ల దుఃఖానికి కారణం అవుతుందట. బుధవారం రోజున తలస్నానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఇక గురువారం రోజున తలస్నానం చేస్తే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఇక శుక్రవారం రోజున అనుకోని వాటిలో ఆపదలు ఎదురవుతాయట. శనివారం రోజున స్నానం చేస్తే మహా భోగం కలుగుతుంది. ఆదివారం రోజున స్నానం చేస్తే కోరికలు ఎక్కువగా పెరుగుతాయట.

Advertisement