Hibiscus Plant : ఎర్రటి అందమైన పుష్పాలను కలిగి ఉన్న మందార మొక్క ను ఇంటి పెరటిలో పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతారు. అంతేకాదు మహాలక్ష్మీదేవి , గణపతి లాంటి దేవుళ్ళకు ఎంతో ప్రీతికరమైన పువ్వులు అని చెప్పవచ్చు. ఇక దిశ ప్రకారం ఇంట్లో మందార పూలను నాటడం వల్ల సానుకూల వాతావరణాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ కాలంలో చాలామంది ఇల్లు ఆకర్షణీయంగా కనిపించడానికి.. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడానికి మాత్రమే ఇంటి పరిసరాలలో ఇలాంటి పూల మొక్కను నాటుతున్నారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం మందార మొక్కలకు ప్రత్యేకమైన దిశ దశ సూచించడం జరిగింది.
ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ప్రత్యేకమైన దిశలో ఈ మొక్క ఏర్పాటు చేయడం వల్ల ఇంట్లో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాదు ఈ మొక్క వల్ల అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఇంట్లో ఎప్పుడూ అశాంతి, డబ్బు నిలవకపోవడం, ప్రతికూల వాతావరణం లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాస్తు శాస్త్రంలో అనేక పరిష్కారాలు సూచించబడ్డాయి. ఈ క్రమంలోనే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా తూర్పు వైపున మందారం చెట్టు నాటినట్లయితే ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడటమే కాకుండా ఇంట్లో ఆహార ధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు.
సూర్యకాంతి కోసం ఇంటి కిటికీ దగ్గర కూడా ఈ మొక్కను నాటవచ్చు. అదనంగా ఈ చెట్టు వల్ల ఇంట్లో అనేక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఎర్రటి పూలు ఇంటి అందాన్ని పెంచడం కాకుండా మరింత ఆహ్లాదాన్ని అందిస్తాయి. ధర్మ శాస్త్రంలో కూడా మందార పువ్వు కు చాలా ప్రాముఖ్యత ఉంది. అదృష్టానికి సంకేతము గా భావించే ఈ పువ్వు ను ప్రతి రోజు అలాగే మంగళవారం రోజు శ్రీహనుమంతునికి సమర్పించడం వల్ల కష్టాలు తొలగిపోయి సంపన్నులు అవుతారని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం తొలగిపోవడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.