Dussehra: దసరా లోపు ఈ వీడియో మీ కంటపడితే అదృష్టం..అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది..!!

Dussehra: ప్రస్తుతం దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది. ఈ పది రోజుల పండుగని ‘నవరాత్ర వ్రతం’ అనీ, ‘దేవీ నవరాత్రులు’, ‘శరన్నవరాత్రులు’ అని వ్యవహరిస్తాం. తొమ్మిది రోజులు నియమ నిష్ఠలతో జగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే శరన్నవరాత్ర వ్రతం. తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతంతెలుగు క్యాలెండర్ ప్రకారం ఆరు నెలల వ్యవధిలో సంవత్సరానికి రెండుసార్లు నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో దుర్గా మాతను తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేయగా.. తెలంగాణలో మాత్రం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహిస్తారు. పదో రోజున విజయ దశమి వేడుకలను నిర్వహిస్తారు. దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రోజులు పాటు యుద్ధం చేసి.. అతన్ని వదించింది. ఆ యుద్ధంలో విజయం సాధించింది. కాబట్టి ఆ తొమ్మిది రోజులు దేవుడు నవరాత్రులుగా పదవ రోజున విజయానికి చిహ్నంగా.. విజయదశమి పండుగ జరుపుకుంటారు. దీంతో పది రోజులు జరిగే ఈ పండుగలో దుర్గామాతని పూజిస్తారు.

Good luck if you see this video before Dussehra Mother will bless you

ఈ నవరాత్రులలో దుర్గామాత భూలోకానికి వచ్చి భక్తులందరినీ దర్శిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాకుండా ప్రత్యేక ఉపవాస దీక్షలు కూడా పాటిస్తారు. తొమ్మిది రోజులలో దుర్గామాతనీ తొమ్మిది అవతారాలతో అలంకరించడం జరుగుద్ది. కాగా దసరా నేపథ్యంలో చాలా మంది భక్తులు అమ్మవారి కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న దుర్గామాతను దర్శించి ఆ తర్వాత శ్రీ లలిత సహస్రనామ పారాయణం చేస్తే అమ్మవారు తన భక్తుల కష్టాల నుండి బయటపడేస్తుందని..అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఓ నమ్మకం.