UGADHI : తెలుగింటి తొలి పండుగ ఉగాది.. ఈ పండుగతోనే తెలుగు వారికి కొత్త సంవత్సరం కూడా ప్రారంభం అవుతుంది. అందుకే దీనిని తెలుగువారి పండగ అని అంటారు. చైత్ర శుద్ధ పాడ్యమినే మనం ఉగాదిగా చెబుతాము.. ఈరోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని పెద్దలు చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యవతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఈ ఉగాది రోజే.. శాలివాహనుడు పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఈ ఉగాది రోజే..
ఇలా చెప్పుకుంటూ పోతే ఉగాది పండుగకు సంబంధించి ఎన్నో ఇతిహాసాలు, కథలు మన పురాణాలలో కనిపిస్తాయి..అయితే ఉగాది మనకు పచ్చి ప్రకృతి పండగ లాగా అనిపిస్తుంది. అయితే ప్రతి పండుగకు కొన్ని ప్రత్యేకతలు ఎలా ఉంటాయో ఆయా రోజుల్లో తప్పకుండా చేయాల్సిన పనులు.. అసలు ఏమాత్రం చేయకూడని పనులు కూడా కొన్ని ఉంటాయి. మన పెద్దలు పండితులు, పండగ పూట చేయాల్సిన పనులు చేయకూడని పనుల గురించి కూడా మనకి చెబుతూ ఉంటారు ఇకపోతే ఈ ఉగాది రోజున ప్రత్యేకించి డబ్బు ఎల్లప్పుడూ ఇంట్లో కలకాలం ఉండాలి అంటే కొన్ని పనులు చేయాలి అని చెబుతున్నారు.
ఉగాది రోజు కొత్త గొడుగు కొనుగోలు చేస్తే మంచి కలుగుతుంది ఇలా చేయడం వల్ల ఏడాది పొడువున ఆ ఇంట్లో డబ్బు నిలుస్తుందని పండితులు చెబుతున్నారు దీంతోపాటు మన పెద్దలు అప్పట్లో ఒక విసనకర్రను కూడా ఉగాది రోజు కొనుక్కునేవారు కొత్త బట్టలు కొత్త ఆభరణాలు వేసుకోవడం ఉగాది రోజు మామూలే. ఉగాది రోజు దానం చేస్తే.. మంచి ఫలితం వస్తుంది కాబట్టి మీరు ఉగాది ఇలా చేసినట్లయితే ఏడాది పొడవున డబ్బు ఉంటుంది.