Lakshmi Devi : లక్ష్మీదేవి పూజలో ఈ ఆకును ఉపయోగిస్తే ఆర్థిక నష్టం తప్పదట..!!

Lakshmi Devi : సాధారణంగా ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షం తిథి నాడు అక్షయ తృతీయ జరుపుకుంటాము. కాబట్టి ఈసారి మే 3వ తేదీన ఈ నేపథ్యంలోనే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి వస్తువులను తప్పకుండా కొనుగోలు చేయాలి అని.. ఒకవేళ స్తోమత లేకపోతే లోహంతో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు అని .. ఇంకా చెప్పాలి అంటే బార్లీ బియ్యాన్ని కొనుగోలు చేసుకుని ఇంటికి వచ్చినా సరే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట.

వీటిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి అమ్మవారి పూజలో సమర్పించినట్లు అయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం పొంది ఆమె కటాక్షం మనపై ఉంటుందట.ఇకపోతే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆకులను పెట్టి పూజించకూడదట. మరి ఇలాంటి మరి కొన్ని ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ ను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తితో కలిపి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. అంతే కాదు లక్ష్మీదేవి సంతోషించి మీరు ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది. ఇక అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని విష్ణుమూర్తితో పూజించేటప్పుడు

Except for the financial loss if this leaf is used in Lakshmi Devi worship
Except for the financial loss if this leaf is used in Lakshmi Devi worship

ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసిని ఉపయోగించవద్దు. తులసి ఆకులను ఉపయోగించి పూజ చేయడంవల్ల లక్ష్మీ దేవి కి కోపం వచ్చి, మన ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందట. ఫలితంగా ఆర్థిక నష్టం తప్పదు అని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు.అక్షయ తృతీయ రోజు అక్షయ సంపదను పొందాలి అంటే ఈ రోజున ఇంట్లో సెల్ఫ్ లేదా లాకర్ ను మురికిగా అస్సలు ఉంచకూడదు. శుభ్రపరిచి అక్కడ లక్ష్మీదేవి పటాన్ని పెట్టాలి. అంతేకాదు అక్షయ తృతీయ రోజు ఎవరికీ రుణంగా ఇవ్వకండి. ఇలా చేస్తే మీరు లక్ష్మీదేవిని వేరొకరికి అప్పగించినట్లు అవుతుందని నమ్ముతారు.