Sunday, May 22, 2022

Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయారా..? సంపద పెరగాలంటే..?

Financial Crisis : అవసరానికి మించిన అప్పులు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతారు. ఆ అప్పులను తీర్చడానికి.. వేరొక చోట అప్పు తీసుకోవడం.. వడ్డీలు కట్టలేక దాని పై తీసుకున్న రుణం ఇవ్వలేక పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతున్నారు. అంతే కాదు చాలా మంది అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న ఎంతోమందిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడాలన్నా.. సంపద పెరగాలన్నా కూడా కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. మరి సంపద పెరగాలంటే ఏం చేయాలి అని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్టికల్ ను వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.

సాధారణంగా రోజులు, తేదీల కంటే తిథుల పై ఆధారంగా పండుగలు, పుట్టినరోజులు, పెళ్లిళ్లు, శుభముహూర్తాలు నిర్ణయిస్తారు. అందుకే తిథుల గురించి చాలా మందికి అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ కూడా దేవతల పుట్టినరోజులను జన్మ తిథి ని బట్టి నిర్ణయిస్తారు అని చాలామందికి తెలియదు. అయితే ప్రతి తిథి కి ఒక దేవుడు ప్రాతినిధ్యం వహిస్తాడు అనే విషయాన్ని మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మొత్తానికి 16 తిధులు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ 16 తిథులలో ఏ తిథి లో ఏ దేవుడిని పూజిస్తే అప్పుల బాధ నుండి బయటపడతారు అనే విషయం మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..

Drowning in Financial Crisis To increase wealth
Drowning in Financial Crisis To increase wealth

పాడ్యమి రోజు సంపద పెరగాలి అంటే అగ్ని దేవుడిని పూజించాలి.
విదియ నాడు దేవుడిని పూజిస్తే అన్ని రకాల విద్యల్లో ముందుంటారు.
తదియ రోజు గౌరీ దేవిని పూజించడం వల్ల కళ్యాణ యోగం పడుతుంది.
చవితి రోజు వినాయకుడు ని పూజిస్తే చేపట్టిన పనులలో విజ్ఞాన తొలగిపోయి, విజయం సాధిస్తారు
పంచమి రోజున నాగదేవతను పూజిస్తారు సర్ప దోషాలు తొలగిపోతాయి.
షష్ఠి రోజున కార్తికేయుడు కి పూజ చేస్తే కీర్తి ప్రతిష్టలు పొందుతారు
సప్తమి రోజున సూర్యభగవానుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి
అష్టమి రోజున దుర్గాదేవికి పూజ చేస్తే శుభం కలుగుతుంది
రోజున దుర్గామాతను పూజించడంవల్ల చెడు అంతం అవుతుంది.
దశమి రోజు ఇంద్ర దేవతలకు పూజ చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి.
ఏకాదశి రోజు కుబేరుడిని పూజిస్తే సిరిసంపదలు పెరగడమే కాకుండా ధనప్రాప్తి కలుగుతుంది
ద్వాదశి రోజున విష్ణువును వామన రూపంలో పూజిస్తే చేసిన పాపం తొలగిపోతుంది.
త్రయోదశి రోజు యమధర్మరాజును పూజిస్తే మరణ బాధలు తప్పి పోతాయి
ఈరోజు రాత్రి చంద్రుడికి పూజ చేస్తే ఆయురారోగ్యాలు ధనధాన్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి.
ఇక అమావాస్య రోజు పితృ దేవతలను పూజిస్తే సంతాన సౌఖ్యం కలుగుతుంది.

Related Articles

- Advertisement -

తాజా వార్తలు