మీ ఇంట్లో బల్లులు పదేపదే కనిపిస్తున్నాయా.. వాటి వెనక దాగున్న అర్థాలు ఇవే..

భారతీయులు మొదటి నుంచి వివిధ రకాల శకునాలను నమ్ముతూ వస్తున్నారు. వాటిలో బల్లి శకునం లేదా బల్లి శాస్త్రం అనేది బాగా ప్రాచుర్యం పొందింది. శరీరంపై బల్లి పడిన ప్రాంతాన్ని బట్టి అది శుభమా, అపశకునా అనేది బల్లి శాస్త్రం నిర్ణయిస్తుంది. ఈ శాస్త్రం మహిళలు, పురుషులకు విరుద్ధంగా పనిచేస్తుంది. ఉదాహరణకు పురుషుడి శరీరంలోని ఏదైనా కుడి భాగంపై బల్లి పడితే అది శుభంగా పరిగణిస్తారు. మరోవైపు మహిళల శరీరంలోని ఎడమ భాగంపై బల్లి పడితే దాన్ని శుభపరిణామంగా పరిగణిస్తారు. అంతేకాదు, బల్లి చేసే కొన్ని శబ్దాల ఆధారంగా భవిష్యత్తును కూడా తెలుసుకోవడం సాధ్యమవుతుందని ఈ శాస్త్రం చెబుతోంది.

ఇంట్లో బల్లులు పదేపదే కనిపిస్తే కూడా దాని వెనుక ఒక అర్థం ఉంటుందని చెబుతారు. బల్లి శాస్త్రం ప్రకారం ఇంట్లో రెండు బల్లులు ఒకదానికొకటి కొట్టుకుంటూ కనిపిస్తే దానిని ఒక అపశకునంగా భావించాలి. ఇలా బల్లులు ఇంట్లో కొట్టుకుంటే లవర్స్ ఒకరి నుంచి ఒకరు విడిపోతారని దాని అర్థం. ఇక గృహప్రవేశ సమయంలో చనిపోయిన బల్లి కనిపిస్తే, ఆ ఇంట్లో ఉండే వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని విశ్వసిస్తారు. బల్లులు ఇంట్లో తరచుగా అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో నివసించే వారికి ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుందని సంకేతం. ఇంట్లోకి వెళ్తున్నప్పుడు బల్లి కీటకాన్ని మింగుతూ కనిపిస్తే మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారని సంకేతం.

బల్లులు ఇంట్లో పదే పదే కనిపించినా అది చెడుకి సంకేతం కాబట్టి వాటిని ఇంట్లో లేకుండా తరిమికొట్టాలి. అలాగని వాటిని చంపకూడదు. చంపితే పెద్ద దోషం మీ జీవితాన్ని ఎల్లవేళలా ప్రభావితం చేస్తుంది. అందుకే బల్లులను తరిమికొట్టే చిట్కాలను పాటించాలి.