Deeparadhana : పూజలో దీపారాధన అతి ముఖ్యమైంది. దీపం లేని ఇల్లు అదృష్టాన్ని ప్రసాదించదు. దీపం వెలిగించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. అందులో ఆవునెయ్యితో దీపం వెలిగిస్తే శుభదాయకంగా ఉంటుంది. ఆవు నెయ్యితో దీపాన్ని ఎలా వెలిగించాలంటే.. ముందుగా దీపారాధన చేసే ఆ మట్టి ప్రమిదలు శుభ్రం చేసుకొని. వాటికి కుంకుమబొట్టు పెట్టాలి. ఆ తరువాత అందులో కి ఆవు నెయ్యి పోసి రెండు వత్తులను వేయాలి.కేవలం అగరువత్తుల తోనే దీపాలను వెలిగించాలి. అగ్గిపుల్లలతో దీపారాధన చేయకూడదు. ముట్టించిన దీపంతో ఇంకొక దీపాలను వెలిగించ కూడదు. సాయంత్రం పూట, ఉదయం పూట ఆవునెయ్యితో దీపారాధన చేస్తే..
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. చేతికి అందవలసిన డబ్బు కూడా అందుతుంది. నేతి దీపాన్ని ఇంట్లో వెలిగిస్తే అప్పుల బాధ నుంచి బయట పడవచ్చు.. లక్ష్మీదేవికి ఆవునెయ్యి అంటే ఇష్టం కనుక ఆమెను స్మరించి దీపారాధన చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు.స్టీలు గిన్నెలో ఎప్పుడు దీపారాధన చేయకూడదట. అగ్గిపుల్లలతో దీపాలను వెలిగించకూడదు. ఒక వత్తితో దీపాన్ని వెలిగించరాదు. ఏక వత్తి కేవలం శవాల దగ్గర మాత్రమే వెలిగిస్తారు. దీపాలను కేవలం అగరవత్తి తో మాత్రమే వెలిగించాలి. దీపారాధన చేసేటప్పుడు కుందికి మూడు వైపుల కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేయాలి. పంచలోహాలతో, మట్టి తో చేసిన దీపాలను వెలిగించడం చాలా శ్రేయస్కరం.
ఉత్తర దిశ వైపు గా తిప్పి దీపాన్ని వెలిగిస్తే విద్య, సిరి సంపదలు వెదజల్లుతాయట. దక్షిణ వైపు దీపారాధన చేయకూడదు. ఈ పక్కన దీపారాధన చేస్తే అపశకునాలు కష్టాలు వెంటాడుతూనే ఉంటాయట. దీపారాధన తామర కాడ తో చేసిన వోత్తులను ఉపయోగిస్తే.. పూర్వజన్మ పాపాలు అన్నీ పోతాయట. తెల్లటి వస్త్రం మీద పన్నీరు జల్లి ఆరబెట్టి.. ఆ తరువాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి.. దీపారాధన చేస్తే శుభ ఫలితాలు పొందవచ్చు. జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో వత్తులను చేస్తే.. ఇంటి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయట. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు.