Mahabharata : హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గ్రంథాలలో మహాభారత గ్రంథం కూడా ఒకటి. శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో కృష్ణావతారం ఎత్తారు. ద్వాపరయుగం మొత్తం 8,64,000 సంవత్సరాలు ఉండగా.. ద్వాపర యుగం లో జరిగిన మొత్తం కథను 18 పర్వాలు గా విడదీసి మహాభారతాన్ని లిఖించడం జరిగింది. ఇక మహాభారతంలో మానవజాతి ఎలా ఉండాలో.. ఉండకూడదో కూడా కళ్ళకి కట్టినట్టు గా చూపించారు. ఇంతటి మహాభారతంలో కీలక పాత్ర పోషించిన భీష్ముడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భీష్ముడు ఎవరు ..? అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..భీష్ముడు లేని భారతాన్ని ఎవరూ ఊహించలేరు. మహాభారతంలో అత్యంత ప్రభావవంతమైన.. శక్తిమంతమైన పాత్ర భీష్ముడిది. త్యాగధనుడు గా.. ప్రతిజ్ఞ పరాయణుడు గా.. సత్య వర్ధనుడిగా.. పరాక్రముడు గా భీష్ముని పాత్ర మహాభారతం లో అనిర్వచనీయం అని చెప్పవచ్చు. భీష్ముడు అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు.. గతజన్మలో అష్ట వసువులలో ఒకరు. అష్ట వశువులు అనగా 8 మంది వసువులు.
ఇక వీరు ఎవరంటే దేవలోకంలో దేవేంద్రుడికి.. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు సహాయకంగా ఉండే శక్తివంతమైన దేవతలు.. సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతికి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు అయిన దేవదూతలు. అలాంటి దేవదూతలలో ఒకరైన భీష్ముడు శాపం కారణంగా మానవ అవతారం లో జన్మించారు.ఇక ఏమిటా శాపం..? ఎవరు పెట్టారు..? ఎందుకు పెట్టారు..? అనే విషయం ఇప్పుడు ఒకసారి మన క్షుణ్ణంగా చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఒకసారి బ్రహ్మదేవుడు లోక కల్యాణార్థం భగవత్ భక్తిని పునరుద్ధరింప చేయాలని సంకల్పించి ..ఒక సభ ఏర్పాటు చేశాడు. ఈ సభ కు అనేక మంది ఋషులు, ప్రజాపతులు అందరూ విచ్చేశారు. లోక కల్యాణం కోసం ప్రజలలో భక్తిని పెంపొందించడానికి మార్గాలు ఏమిటో.. అవి ఎలా చేయాలో ఆ సభలో చర్చించుకుంటున్నారు.. ఈ సభకు అష్ట వసువులైన దేవదూతలు కూడా విచ్చేయడం జరిగింది. అక్కడ ఆ సభ జరుగుతున్న సమయంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.
ఇక ఆ సభలో కి హిమవంతుని పెద్ద కుమార్తె మహా అద్భుత సౌందర్యరాశి అయినటువంటి గంగాదేవి ప్రవేశించింది. ఇక అదే సమయంలో అనుకోని సంఘటనగా పెద్ద గాలి వీచింది. ఆ గాలికి గంగాదేవి పవిట తొలిగింది. ఇక తాము చతుర్ముఖ బ్రహ్మ సభలో ఉన్నామని గుర్తెరిగిన సభష్యులు అందరూ గౌరవం పాటించి అది గమనించనట్టుగా అందరూ తల దించుకున్నారు. కానీ అందులో గోపీసుడు అనే రాజఋషి మాత్రం ఆమె అందానికి మంత్రముగ్ధులై తదేకంగా చూడసాగాడు. ఇక గంగాదేవి కూడా గోపీసుడి చూపులకు తల తిప్పుకోలేక తన కళ్ళలోకి తదేకంగా చూడసాగింది. ఇక తాము చతుర్ముఖ బ్రహ్మ సభలో ఉన్నామన్న ఇంగితం కూడా మరిచిపోయి వారిలో కామవాంక్ష మొదలైంది.అది గమనించిన బ్రహ్మ దేవుడికి ఆశ్చర్యమేసింది. సభలోకి వచ్చిన గంగాదేవి ఇలా ప్రవర్తించడం. అందుకు ప్రతీకగా రాజఋషి గోపీసుడు అలా ప్రవర్తించడం చతుర్ముఖ బ్రహ్మకు కోపాన్ని తెప్పించాయి. వెంటనే వారిద్దరిని ఆయన శపించాడు.
ఋషి వి అయ్యుండి సమయ .. అసమయ.. వివేక.. విచక్షతలు లేకుండా కామవాంఛీతుడవై అసభ్యకరంగా ప్రవర్తించావు కనుక నీవు మరల జన్మలో భూలోకము నందు మానవుడిగా జన్మింతివు గాకా అని బ్రహ్మ శపిస్తాడు. గంగా దేవిని చూసి నీవు కూడా భూమిపై ఆ గోపీసుడికి భార్యగా జన్మింతువు గాక అని శపిస్తాడు. అయితే చేసిన తప్పును తెలుసుకున్న వారిరువురు బ్రహ్మదేవుడిని వేడుకొనగా.. ఆయన మీరిరువురు భూలోకానికి వెళ్లి మానవ రూపం దాల్చి శాపాన్ని అనుభవించిన తర్వాత దేహాన్ని వదిలి స్వర్గానికి చేరుకుంటారు అని చెబుతాడు.ఇక ఫలితంగా గోపీసుడు భూలోకంలో ప్రదీపుడు అనే మహారాజుకు జన్మిస్తాడు. ఇక గంగాదేవి కూడా భూలోకానికి బయలుదేరినప్పుడు మార్గంమధ్యలో ఆమెకు ఏడుస్తున్న అష్టవసువులు ఎదురవుతారు.
ఇక గంగాదేవి ఆశ్చర్యంగా వారి వైపు చూసి ఎందుకలా ఏడుస్తున్నారు అని అడగగా అందుకు వారు ..అమ్మా మేమే అంగా ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువులము. మేము మా భార్య లతో కలిసి ఆకాశమార్గాన విహరిస్తూ ఉండగా భూలోకంలో దివ్య తేజస్సు గల కామదేనువు మా కంట పడింది. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే అది వశిష్ట మహాముని ఆశ్రమం. మేము ఆ కామధేనువును దొంగతనం చేసిన విషయాన్ని వశిష్ట మహారాజు తెలుసుకొని.. వచ్చే జన్మలో మానవులుగా జన్మించమని శపించాడు.. కానీ వశిష్ట మహామునిని వేడుకోగా అందులో ఏడు మంది మానవులుగా జన్మించి వెంటనే మరణించి మళ్ళీ వసువులుగా మారుతారు.. మిగిలిన ప్రధాన సూత్రధారి దొంగలించిన ధృవ్ మాత్రం పాపాన్ని అనుభవించాల్సిందే అని అష్టవసువులు గంగాదేవికి చెబుతారు.. ఇక మీరు ఎందుకు భూలోకానికి వెళ్తున్నారు అని అడగగా.. తన శాపం గురించి చెబుతుంది గంగాదేవి.. అలా అయితే శాపవిమోచనం కలిగించమని గంగా…