Devotional News : పురాణాల ప్రకారం కలబంద ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసా..?

Devotional News : కలబంద మొక్క అంటే దానిని సౌందర్య సాధనాలలో.. ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కలబంద మొక్క గురించి మన పురాణాల్లో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఈ కలబంద మొక్కను వారంలో ఈ రోజున ఇంట్లో అక్కడ పెడితే.. మీ జీవితంలో మీరే ఊహించని విధంగా ఎన్నో మార్పులు చేకూరుతాయట. మన పురాణాల గురించి కలబందలో ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.కలబంధ మొక్క మీ ఇంట్లో ఉంటే 33 కోట్ల దేవుళ్లు మీ ఇంట్లో ఉన్నట్లే అని చెప్తూ ఉన్నాయి పురాణాలు. కలబంద మొక్క గురించి మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.

కలబంధ మొక్క ముళ్ళు లను కలిగి ఉంటుంది.. అయితే ప్రతి యొక్క ముల్లులో ఒక్కో అధిష్టాన దేవుడు కొలువై ఉంటారని శాస్త్రాలు తెలపడం జరిగింది. మీ ఇంట్లో అప్పుల బాధలు ఉన్నా.. మీ ఇంట్లో చీటికి మాటికి గొడవలు ఏర్పడుతున్నా.. లక్ష్మీదేవి అనుగ్రహం ఎదురుచూస్తున్నా తప్పక చేయవలసిన పని ఒకటి ఇది. అదేమిటంటే మంగళవారం రోజున ఒక కలబంద మొక్కను తీసుకొని.. దానిని నీటితో బాగా శుభ్రపరచి. పసుపు కుంకుమ , గంధం పువ్వులతో పూజించాలి.మంగళవారం రోజున ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు ఈ పని చేయాలి. ఆ సమయంలో మంగళ హోరా ఉంటుంది. పూజామందిరంలో పెట్టిన ఈ కలబంద మొక్కను.. మీరు ఏ సింహ ద్వారం నుంచి లోపలికి వస్తూ ఉంటారో ఆ ద్వారానికి తలక్రిందులుగా వేలాడదీయండి.

Do you know how aloe vera is used according to the myths
Do you know how aloe vera is used according to the myths

ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా బయటికి పోతుంది. ఇక ఇంట్లో ఉండే దుష్ట శక్తులు కూడా బయటికి పోతాయి. ఇక మీరే ఊహించనంతగా ధనలాభం వస్తుందట. ఒకవేళ మంగళవారం రోజున ఈ మొక్క తెచ్చుకో లేకపోతే.. పౌర్ణమి రోజున, అమావాస్య రోజున , లేదా ఏదైనా మంచి రోజున తెచ్చుకున్నప్పటికీ కూడా మంగళవారం రోజున మాత్రమే ఈ కలబంద మొక్క ను కట్టాలి. ముఖ్యంగా ఈ మొక్కను కట్టేటప్పుడు సంకల్పం చెప్పడం చాలా ముఖ్యమట.