Gods Photos : మన భారతదేశంలో హిందువులకు దేవుని పట్ల అపారమైన భక్తి ఉంటుంది.అందుకే ప్రతి ఒక్కరి నివాసంలో పూజగదికి ప్రత్యేక స్థానం ఉంటుంది. నిత్యం భగవంతుణ్ణి ఆరాధిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం, దేవతా విగ్రహాలు, పూజ సామగ్రి, దేవతల పటాలు, పూజగదిలోనే ఉంచుకోవాలి.అయితే కొన్ని పగిలిన వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం అంటే దరిద్రదేవతని ఆహ్వానించినట్టే.. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
Gods Photos : మీ ఇంట్లోని దేవుడి గదిలో ఈ వస్తువులు ఉంటే వెంటనే పారేయండి..
ఎలాంటి వస్తువులను పూజ గదిలో ఉంచకూడదో తెలుసా .విరిగిన లేదా పాడైపోయిన దేవుని స్వరూపాలు,దేవి లేదా దేవుడి ఉగ్ర రూపం దాల్చిన ఫోటోలు,ఒకటి కంటే ఎక్కువ శంఖు చక్రాలు కలిగిన ఫోటోలు,చిరిగిన మత గ్రంధాలు పాడై పోయిన లేదా విరిగిన పూజా వస్తువులు ఉంటే దారినపోయే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నట్టేనని పండితులు హెచ్చరిస్తుంటారు.
Gods Photos : ఏ వస్తువులు దేవుని గదిలో ఉంచితే శుభం కలుగుతుందో చూద్దాం
పసుపు కొమ్మలను లక్ష్మీదేవికి ప్రతి రూపంగా సూచిస్తారు . పసుపు ద్వారాలు ఉంచడానికి నియమాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో పసుపు కొమ్మలను ఎర్రటి గుడ్డలో చుట్టి దేవుని గదిలో ఉంచాలి.ఇలా చేస్తే పాజిటివ్ ఎనర్జీ పెరిగి ధనాకర్షణ జరుగుతుంది. నీటితో నిండిన కలశం దేవతల నివాసంగా భావిస్తారు . కంచు లేదా రాగి కలశాన్ని నీటితో నింపి, అందులో కొన్ని మామిడి ఆకులను వేసి, దాని ముఖంపై కొబ్బరికాయను ఉంచాలి.అందులో తమలపాకులను వేసినా మంచిదే..ఏ శుభాకార్యమైనా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మన అనవాయతీ..అలాంటి అక్షింతలకి అర్ధం,బియ్యం కష్టపడి సంపాదించ్చే తత్వానికి నిదర్శనం . అక్షత సమర్పణ అంటే మనం మన కీర్తిని మన కోసం కాకుండా ఇతరుల సేవ కోసం ఉపయోగిస్తాము. దేవుడి పూజ గంట కొట్టడంతో ముగుస్తుంది.
ఈ విధంగా తప్పకుండా గంటలు మోగించే ఇళ్లలో వాతావరణం శుభ్రంగా , సానుకూలంగా ఉంటాయి.గంట శబ్దంలో ఉండే ఓంకార నాదం నెగటివ్ ఎనర్జీని ఇంట్లో అడుగుపెట్టకుండా చేస్తుంది.ఇంట్లో సకల సమృద్ధికి తలుపులు తెరుస్తుంది. గరుడ గంటను ఇంటి పూజా స్థలంలో ఉంచాలి. ప్రతి ఇంట్లో దేవతలకి చందనంతో బొట్లు పెడుతుంటాం. ఈ చందనం శాంతికి, చల్లదనానికి మారుపేరు.పూజా గదిలో చందనం ఉంచాలి. గంధపు సువాసనతో మనసులోని నెగటివ్ పవర్ అంతా తొలగిపోతుంది. సాధారణంగా శివలింగంపై చందనం పూస్తారు. ఆ గంధాన్ని నుదుటిపై రాసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా పూజగుడిని పువ్వులు, ఫలాలు, దీపాలు, ఆగరబత్తిలతో మన స్తొమత కొద్ది అలంకరించుకొని, భగవంతుణ్ణి భక్తితో, నిశ్చలమైన మనసుతో పూజిస్తే ఆ దేవుడి కృప అందరి మీద ఉంటుంది.