Devotional : అమ్మవారికి కట్టిన చీరతో ఇలా చేస్తే.. మంచి జరుగుతుందా..?

Devotional : భారతీయ సాంప్రదాయం ప్రకారం మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేకమైన పూజలు చేయిస్తూ, వస్త్రాలను సమర్పిస్తూ ఉంటాము.. అందులో ముఖ్యంగా అమ్మవారికి ఒక ప్రత్యేకమైన చీర అనేది ఇస్తూ వుంటాము.. అయితే అలా అమ్మవారికి పెట్టిన ఆ చీర చాలా విశిష్టమైనదట. మరి వాటి గురించి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.అమ్మవార్లకు గాని, స్వామివార్లకు గాని కట్టిన వస్త్రాలను శేష వస్త్రాలు అని పిలుస్తూ ఉంటారు. శేషము అంటే మిగిలినదని అర్థం. అంటే వాళ్ళు ధరించిన తరువాత మిగిలినది అని అర్థం.. ముఖ్యంగా మనం ప్రసాదంగా కూడా వీటిని భావించవచ్చు.

కొత్తగా ఏదైనా వస్త్రాలు తెచ్చిన దేవుడి దగ్గర పెట్టి ఇచ్చిన తరువాత వాడుకుంటూ ఉంటాము.. ఇక మరొక విధానం ఏమిటంటే అమ్మవారికి లేదా స్వామివారికి కట్టించిన బట్టలను మనం ధరించడం. అయితే వాటిని మనం ధరించే వచ్చా ధరిస్తే ఏం జరుగుతుందో అనే విషయం కొంత మందికి మాత్రమే తెలుసు.ముఖ్యంగా అమ్మవారి బట్టలను భారతీయ సాంప్రదాయం ప్రకారం మన వేలం లోనే కొనాలట.. అలా వచ్చిన డబ్బును కేవలం ఆలయ అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలి.. కానీ పక్కదారి పట్టిస్తే మాత్రం అది పాపం అని కొంతమంది నిపుణులు తెలియజేయడం జరుగుతుంది. అయితే కొన్ని దేవాలయాల నుంచి శేష వస్త్రాలు కొంతమందికి బహుమతి రూపంలో పంపిస్తూ ఉంటారు.

do this with a sari tied to the seller will it be good
do this with a sari tied to the seller will it be good

వాటిని మనం ఏదైనా పూజా కార్యక్రమంలో చేసేటప్పుడు మాత్రమే ధరించాలి అని చెబుతూ ఉంటారు. అలా వచ్చిన వస్త్రాలను మనం ధరించవచ్చు. అది కూడా చాలా మంచిది.అయితే కొన్ని సమయాల్లో మాత్రం..(మలమూత్ర విసర్జనలు, ఇంట్లో అశుభం, మైల) వంటివి జరిగినప్పుడు ఈ వస్త్రాలను ముట్టుకోకూడదు.. ఎందుచేత అంటే ఇవి ప్రకృతికి సంబంధించిన విషయాలు ప్రకృతి తోనే ముడిపడి ఉంటాయి కాబట్టి.. అలాంటివి ఎదురైనప్పుడు ఆ బట్టలను ఉతికి ఇంట్లో శుభ్రంగా ఎత్తి పెట్టాలి. అందుచేతనే మనం అమ్మవారి దగ్గర నుంచి వచ్చే ఎటువంటి కానులైనా..మనం ధరించడం చాలా అదృష్టంగా భావించాలి. వీటి ద్వారా మనకు ఎంతో పుణ్యం లభించడంతో పాటు మన కుటుంబ సభ్యుల సమస్యలు కూడా తీరుతాయి.