Devotional News : ఏ చిన్న పని జరగాలన్నా ఈరోజుల్లో డబ్బు అవసరం ఎంతైనా ఉంది. ఎంత డబ్బు పెడితే అన్ని పనులు జరుగుతాయి. కానీ ప్రస్తుతం అందరి దగ్గర డబ్బు ఉండటం లేదు. వారి అవసరాలు తీర్చుకోవడానికి సరిపడా డబ్బు సంపాదించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే అవసరాలు తీరక అప్పులు కూడా చేయవలసి వస్తోంది.. ఈ అప్పులు ఒక్కసారి మొదలయ్యాయి అంటే ఇక జీవితాంతం తరతరాలుగా ఈ అప్పుల బాధలు వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి అప్పుల నుండి బయటపడాలంటే లక్ష్మిదేవి కరుణాకటాక్షాలు ఉండాల్సిందే…

లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎంతో మంది పండితులను పిలుచుకు వచ్చి పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయినా సరే ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. దీనికి గల కారణం మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు అని పెద్దలు చెబుతూ ఉన్నారు. అందువలన మీరు ఎన్ని పూజలు, వ్రతాలు చేసిన ఉపయోగం లేదని అంటూ ఉన్నారు. ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
గడప అనేది లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తూ ఉంటారు. అందువలన గడప మీద కూర్చోవడం,నిల్చోవడం వంటి పనులు చేయకూడదు. గడపను కాలితో తొక్కకూడదు.
ఇంట్లో ఒకరి తలకు కొబ్బరి నూనె రాసి.. మళ్లీ అదే చేత్తో వేరొకరికి నూనె రాయడం అనేది అశుభకరమట. దీనివల్ల లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్లి పోతుందట.
ప్రతిరోజు కొంతమంది బట్టలు ఉతుకుతూ నే ఉంటారు. అయితే బట్టలు ఉతకడానికి సరైన సమయం ఉండనే ఉంటుంది. ఉదయం సమయంలో మాత్రమే బట్టలు ఉతకాలి. అలా కాకుండా సాయంత్రం వేళల్లో బట్టలు ఉతికితే దరిద్రం చుట్టుకుంటుందట. వారంలో మంగళవారం, శుక్రవారము బట్టలు ఉతకకూడదు.
ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత కాళ్ళు ,చేతులు ఆరిన తర్వాత మంచం మీద కూర్చోవాలి. అంతేకాని తడి కాళ్లతో మంచం మీద కూర్చున్నా.. ఇంట్లో తిరిగినా దరిద్రం చుట్టుకుంటుందట.
చీపురు, రోకలి వంటివాటిని కాలితో తొక్కకూడదు.. వాటిని స్థిరంగా ఏదైనా ఒక మూలన ఉంచుకోవాలి. ఎప్పుడూ మంచి మాటలు.. మంగళకరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి.