పూర్వం నుంచి మన పెద్దలు కొన్ని విషయాలను ఆచారాలుగా తెలియ చేస్తూ ఉన్నారు. కానీ అవన్నీ నేటి తరానికి మూఢనమ్మకాలు గా.. పెద్ద వాళ్ళు చెబితే చాదస్తంగా అనిపిస్తుంటాయి. కానీ మన పెద్దవాళ్ళు కొన్ని ఆచారాలను తప్పకుండా పాటించాలి అని లేకపోతే నష్టం జరుగుతుంది అని హెచ్చరిస్తూ ఉంటారు. దానికి వారు చెప్పే ఏ విషయం కూడా మూఢనమ్మకాల కాదు. వాటి వెనుక కొన్ని శాస్త్రీయం మాత్రమే కాదు సైన్స్ నిజాలు కూడా దాగి ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.పూర్వం మనపెద్దలు ఏదయినా నదిని దాటేటప్పుడు ఆ నదిలో నాణేలు వేస్తే మన కోరికలు తీరుతాయని చెప్తారు. కానీ మనకది మూఢ నమ్మకం గా అనిపిస్తుంది. కానీ అందులో శాస్త్రీయ నిజం కూడా దాగి వుంది.
అది ఏమిటి అంటే పూర్వం మనదేశంలో డబ్బు నాణేలు అనేవి రాగి లోహం తయారు అవుతుండేది . ఆ రాగి నాణేలు నదిలో వేయడం వలన నదిలో వున్న నీటిని ఫిల్టర్ చేసిన శుభ్రపరుస్తుంది. నీటి లో వున్న సూక్ష్మజీవులను చంపివేసే గుణం రాగిలోహంకి ఉంది. సాధారణంగా అయితే ఇలాంటివి ప్రజలు పట్టించుకోరు కాబట్టి మంచి జరుగుతుంది అని ఒక మాట చెబితే కచ్చితంగా ఆ పనిని పాటిస్తారు అని మన పెద్దవాళ్ళు ఇలా దాటేటప్పుడు చేస్తే కోరికలు తీరుతాయి అని చెప్పారు. అప్పటినుంచి ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతువుంది. కానీ ఇటీవల కాలంలో లో ఐరన్ తో నాణేలు తయారు చేస్తున్నారు కాబట్టి నీటిలో వేయకపోవడం మంచిది.ఇక గుమ్మానికి నిమ్మకాయలు కట్టడం వెనుక శాస్త్రీయకోణం ఏమిటో తెలుసుకుందాం.
మీరు అంగళ్ళు ముందు కానీ ఏదయినా వాహనాలకి కానీ నిమ్మకాయలు , మిరపకాయలు కట్టడం చూసి వుంటారు. దాని వల్ల దిష్టి తగలకుండా ఉంటుందని మన నమ్మకం. కానీ దీని వెనుక ఒక శాస్త్రీయ నిజం కూడా వుంది. అది ఏమిటంటే నిమ్మకాయలొ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.సిట్రిక్ యాసిడ్ కి బ్యాక్టీరియాను చంపే గుణం ఉంటుంది. మరియు మిరపకాయలకు బయట నుంచి వచ్చే గాలిలో ఉండే సూక్ష్మజీవులను నశింపచేసే గుణం ఉంటుంది. అందువల్ల గుమ్మానికి నిమ్మకాయలు మరియు మిరపకాయలు కడతారు. అందుకే పెద్దలు చెప్పేవన్నీ మూఢనమ్మకాలు కాదు. కొన్నింటి వెనక శాస్త్రీయ నిజాలు దాగి ఉన్నాయి.కొన్నింటిని మనం ఇప్పటికీ నమ్ముతూ వస్తున్నాము. ఇప్పటికీ మూఢనమ్మకాలు గా భావించేవారికి వాట్సాప్ లేదు ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.