Chanakya Niti : ఒక వ్యక్తి ఆలోచనలు, నడవడిక, ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటాం. ప్రతి ఒక్క స్త్రీ తన జీవిత భాగస్వామి మంచి లక్షణాలతో ఉండాలని కోరుకుంటుంది. జీవితం మొత్తం తన భర్తని అనుసరించాలని భావిస్తుంది. చాణక్యు నీతి చెప్పిన ప్రకారం.. పురుషులలో కొన్ని రకాల లక్షణాలు ఉన్న వ్యక్తులను ఉత్తమ ఎంపికగా భావిస్తున్నారు.
1. నిజాయితీ : సంబంధాలలో నిజాయితీగా ఉన్న వ్యక్తి ప్రతిచోటా గౌరవింపబడువాడని చాణక్యుడు చెప్పాడు. స్త్రీల పట్ల గౌరవం ఉన్న పురుషులు.. ఇలాంటి వారు తమ భార్యను, స్నేహితురాలిని ఎన్నటికీ మోసం చేయలేరు. పురుషులలో ఉన్న ఈ గుణం స్త్రీలను ఆకర్షింపజేస్తుంది.
2. నడవడిక : మధురమైన మాటలు. మర్యాద, సౌమ్యత వంటి గుణాలు పురుషులలో ఉండాలని కోరుకుంటారు. ఈ లక్షణాలు పురుషుల్లో ఉంటే. అది వారి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి పురుషులు తమ మధురమైయిన కంఠంతో ప్రజల హృదయాలను దోచుకుంటారు. ఈ లక్షణాలు ఉన్న పురుషులు.. మహిళలను చాలా బాగా ప్రభావితం చేస్తారు.
3.శ్రోత: ప్రతి ఒక్క స్త్రీ తన భాగస్వామి నీడలాగా ఉండాలని కోరుకుంటుంది. మంచి శ్రోతగా ఉన్నటు వంటి మగవారిని ఇష్టపడుతుంది. అతని గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తుంది. మంచి మనిషికి గుర్తు అంటే.. మాట్లాడే శక్తి ఉన్న వారికి వినే శక్తి కూడా ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది.
4. మంచి ఆలోచనా విధానం :- ఆచార్య చాణక్యుడు. చెప్పిన ప్రకారం మంచి ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తిని అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా స్త్రీలు మంచి ఆలోచనలు కలిగిన పురుషులను ఇష్టపడతారు. స్త్రీలు మంచి సద్గుణాలున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఇష్టపడతారు.