Chanakya Niti : భర్త బయటకు వెళ్ళేటప్పుడు భార్య అస్సలు చేయకూడని పనులేంటో తెలుసా..!

Chanakya Niti : ప్రతి పెళ్లాయినా మహిళా విజయం వెనుక భర్త ఉన్నట్టు, ప్రతి భర్త విజయం వెనుక భార్య కూడా తప్పక ఉంటుంది. పెళ్ళైన తరువాత మగవాడి శ్రేయస్సు కోరుకొనేవారిలో భార్య మొదటి స్థానంలో ఉంటుందంటే అతిశయోక్తి లేదు. ప్రతి స్త్రీ తన భర్త సుఖంగా ఉండాలని, తాను ఎప్పుడూ సుమంగళిగా ఉండాలని అనుకుంటుంది.అందుకోసం ఎన్నో పూజలు, పురస్కారాలు చేస్తుంది.కానీ భర్త ఇంట్లో నుంచి ఏదయినా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ,వెళ్లాక కానీ కొన్ని పనులు చేయకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. పెళ్లయిన స్త్రీలు భర్త ఉద్యోగరీత్యా బయటికి వెళ్లినప్పుడు ఈ 5 పనులు చేయకూడదని అంటారు.. అవేంటో ఇప్పుడు చుద్దాము..భర్త ఏదైనా కార్యానుసారం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు భార్య జుట్టును విరబోసుకొని అతనికి ఎదురుగా రాకూడదు,జుట్టు దువ్వకూడదు అంటారు.

Advertisement

అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయి సంబంధాలపై ప్రభావం పడుతుందని నమ్ముతారు. అంతే కాదు, ఏ పని సరిగా జరగక ఇంట్లో డబ్బు సమస్యలు ఎదుర్కోనే ప్రమాదం ఉంటుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. భర్త ఇంట్లోంచి వెళ్లిన వెంటనే తల స్నానం చేయడం మంచిది కాదు. ఇంట్లో ఏదైనా ఆపద వచ్చినప్పుడు మాత్రమే ఇలా వెంటనే స్నానం చేస్తారు. కాబట్టి భర్త శుభకార్యాల కోసం బయటకు వెళ్లిన వెంటనే స్నానం చేయకూడదు. ఇంటిలోని ఎవరైనా బయటకు వెళ్లినప్పుడు బకెట్ ఖాళీగా ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఎవరైనా ఖాళీగా ఉన్న పాత్రలను చూస్తూ ఇంటిని వదిలి వెళ్లడం వల్ల వారు అనుకున్న పనిలో ఆటంకాలు ఎదురవుతాయి..భర్త బయటకు వెళ్ళేటప్పుడు స్త్రీలు తమ శరీరానికి కానీ లేదా జుట్టుకు కానీ నూనె రాయకూడదు.

Advertisement
Chanakya Niti Do you know what the wife should not do when the husband goes out
Chanakya Niti Do you know what the wife should not do when the husband goes out

ఇలా చేయడం వల్ల భర్త ఆయుష్షు తగ్గుతుందని నమ్ముతారు.భర్త ఇంటి నుంచి వెళ్లిన తర్వాత కొన్ని గంటల తర్వాత తలకు నూనె రాయాలి.తల స్నానం చేసిన వెంటనే తడి జుట్టుకు సింధూరాన్ని పూయకూడదు. పెళ్లయిన ఆడవాళ్లు ఇలా చేయడం మంచిది కాదని అంటారు. నిజానికి సిందూరం తడి వెంట్రుకలలో పెట్టడం వల్ల ఆ నీళ్లలో కుంకుమ కలిసిపోయి ఇన్ఫెక్షన్ వస్తుంది.ఇది శుభప్రదం కాదని కూడా నమ్ముతారు . జుట్టు సరిగ్గా ఆరిన తర్వాతే నుదుట సింధూరాన్ని దిద్దాలని, అదే భర్త ఆయుష్షు కి మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.మహిళలు ఎప్పుడుపడితే అప్పుడు బొట్టు, తాళి తీయకూడదు.పెళ్లయినా స్త్రీలు ఇలా చేయడం మంచిది కాదు. భర్త బయటకు వెళ్ళేటప్పుడు భార్య నుదట సిందూరం చూసి వెళితే అతను అనుకున్న పనులు సులువుగా జరుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

Advertisement