మానవ జీవితంలో తప్పు చేయనివారు వుండరు. కానీ ఏదయినా తప్పు తెలియక చేస్తే ఆ తప్పు క్షమించదగినది కాదు అని తెలిసి కూడా తప్పు చేస్తే అది మోసం,అది క్షమించారానిది. మానవుడు తన జీవితం లో ఎలా నడుచుకోవాలో చెప్పేదే గరుడ పురాణం . గరుత్మంతునికి ఆ మహావిష్ణువు జీవులు ఏ ఏ తప్పు చేస్తే ఏ జన్మ పొందుతారో క్షుణంగా వివరించాడు.అది ఏమిటో తెలుసుకుందాం. విష్ణు వాహనుడు అయిన గరుత్మంతుడు ఒకసారి భూలోక విహారానికి వచ్చి జరిగే పాపాలు, పుణ్యాలు,వేష భూషణలు చూసి కలత చెంది,వైకుంఠంలోని విష్ణువు దగ్గరకు వెళ్లగా అక్కడ విష్ణువు లక్ష్మీదేవి సమేతంగా విరాజిల్లుతూ ఉంటాడు. గరుత్మంతుడు అక్కడకి వెళ్ళి ప్రక్కకు నిల్చుంటాడు. అది గమనించిన విష్ణువు గరుత్మంతుడు లోకాలను తిరిగి రావడానికి వెళ్ళావు కదా చూసావా, ఎలా వున్నాయి లోకాలన్నీ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు గరుత్మంతుడు మహానుభావ లోకాలు అన్నిటిలో కెల్లా భూలోకం బాగున్నది. కానీ అక్కడ పాపాలు, శోకాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి పరిష్కారమే లేదా అనే ప్రశ్నల రూపంలో తనకు అర్థము కాని విషయాలను అడుగుతారు. అప్పుడు మహావిష్ణువు గరుత్మంతుడుకి కలిగిన సందేహాలను ఓపికగా సమాధానాలను చెబుతాడు.
గరుత్మంతుడు మొదటి ప్రశ్న గా స్వామి అన్నింటి కన్నా దుఃఖమైనది మరణం.. ఆ మరణం అంటే ఏమిటి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మహావిష్ణువు గరుత్మంత మరణం కాలానికి మరొక రూపం,వారి వారి కాలం తీరి పోగానే ఆత్మ శరీరం నుండి విడిపోతుంది. తర్వాత జీవం నుండి జీవాత్మ వేరవుతుంది. జీవి భూమిపై చేసిన కర్మలన్నింటినీ మరిచిపోవడానికి ఈ మరణం కలుగుతుంది. జీవుడు కాలం చెప్పుచేతల్లో ఉంటాడు. మానసిక, శారీరక భావనలు అన్ని కాలం చెప్పుచేతల్లో ఉంటాయి. ఆకాశ నది భావం కూడా కాలం తీరి కనబడకుండా అవుతాయి. ఈ విధంగా మనిషి కాలక్రమంలో కనబడకుండా పోతాడు. ఎవరైతే కాలక్రమంలో అబద్ధం ఆడని వారు, ఈషా ద్వేషాలకు లోనుకాకుండా, మోసం, దొంగతనాలు చేయకుండా, దైవంనందు మనసు ఉంచిన వారికి మరణం కూడా చాలా సుఖంగా ఉంటుంది. లేకుంటే మరణం పొందే మనిషికి తప్ప.. యమదూతలు ఎవరికీ కనిపించకుండా చాలా శిక్షలు వేసి తీసుకువెళ్తారు. మోహంతో అధర్మానికి పాల్పడుతూ బతికే వారిని.. అందరికీ అధర్మం నేర్పేవారికి మరణం సమయంలో కన్నులు పొడుచుకొని చూసినా ఏమీ కనబడకుండా చీకటిగా ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది. అబద్దాలు చెప్పే వారు, మోసాలకు పాల్పడే వారు అర్థంకాని మరణాన్ని పొందుతారు.
భయంకరంగా హింసాత్మకంగా యమభటులు లాక్కెళ్తూ ఉంటే ఎవరైనా రక్షించండి అని అరుస్తారు. ఆ అరుపులు ఎవరికి వినబడవు. ఎవరు రారు చివరికి మరణించిన దాన్ని చూడడానికి కూడా తమ బంధువులు ఇష్టపడరు. గరుత్మంతా ఈ మరణం ఈ విధంగా ఉంటుంది. సృష్టి అంతా ఒక ఏదో ఒక రోజు కాలంలో కలిసిపోతుంది. జీవులు కూడా మరణిస్తారు.ఈ విధంగా గరుడ్మంతుడు జీవునికి మరణం తప్పదని అర్థం చేసుకున్నాడు. కాబట్టి మరణం గురించి ఆలోచించకుండా తమ పనులు తాము చేసుకుంటూ వెళ్లే వారికి ఈ దుఃఖ బాధలు తప్పుతాయి అని అర్థం చేసుకుంటాడు. గరుడ్మంతుడు స్వామి మరణం అయితే తప్పదు అని తెలిసింది కానీ,మరణం తరువాత జీవుడు ఎక్కడికి వెళ్తాడు అడిగాడు. మహావిష్ణువు గరుత్మంత లోకంలో జీవులన్నీ తమ పూర్వజన్మ ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు. అసుర దేవా, అసురలు గా పుట్టిన వారు భోగాలను అనుభవిస్తూ ఉంటారు. మనుషులు గా,పక్షులు ఇతర జంతువులుగా పుట్టిన వారు మాత్రం ఎక్కువగా దుఖించడానికే పుడతారు. నరకం లో తన పాపాలకు శిక్ష అనుభవించినగాని, మరుజన్మ లో కూడా ఏ కీటకంగానో, అడవిలో జంతువుగానో, ఏదయినా అవిటితనంతోనో పుట్టి పాప ఫలితం అనుభవిస్తారు.
ఘరుత్మంతా ఏ పాపం చేస్తే ఏ జన్మ ఎత్తుతాడో చెబుతాను విను అని విష్ణువు చెబుతాడు. స్త్రీ హత్య చేసినవాడు మరు జన్మలో దీర్ఘ రోగిగా,గురు భార్యను కోరుకున్నవాడు దీపం పురుగు, క్రిమి, గడ్డి,పొదలాగా పుడతాడు. బ్రాహ్మణుని కొట్టినవాడు,గో హత్య చేసిన వాడు పురుగు లాగా పుడతాడు. పెళ్లి కానీ అమ్మాయి ని హత్య చేసిన వాడు కుష్టురోగి లాగా, తోబుట్టువు అయిన స్త్రీని కోరితే నపుంసకుని గా పుడతాడు. బ్రాహ్మణుడైనా మాంసం తింటే కుష్టి రోగి లాగా, బ్రాహ్మణుడైన వాడు కల్లు తాగితే అవయవ లోపంతో పుడతాడు. ఇతరులుకు పెట్టకుండా చూస్తూ తినేవాడు గలగండ రోగి లాగా పుడతాడు. అబద్ధం సాక్ష్యం చెబితే మూగవాడు లాగా జన్మిస్తాడు.పంక్తి భోజనం లో ఒకరికి ఒక లాగా మరొకరికి మరొక లాగా భోజనం వడ్డిస్తే ఒంటికన్ను తో పుడతారు. జరుగుతున్న పెళ్లి చెడగొట్టిన వాడు గతి లేని వాడు గా జన్మిస్తాడు. పుస్తకాలను దొంగలించిన వాడు గుడ్డివాడి గాను, బ్రాహ్మణులను గోవులను తన్నిన వాడు కుంటివాడు గాను పుడతారు.అంటూ చాలా చక్కగా వివరించారు.