సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువాలు ఖచ్చితంగా ఉండనే ఉంటాయి. వాటిని ప్రత్యేకంగా ఒక మిర్రర్ ని కూడా ఉండే వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. అందుచేతనే ప్రస్తుతం ఎవరి ఇంట్లో అయినా సరే బీరువా కు అద్దం ఉన్న బీరువానే వాడుతూ ఉంటారు.అయితే ఇలాంటి బీరువా ఉన్న ఇంట్లో వారు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారని తెలియజేయడం జరుగుతుంది.కొంతమంది వాస్తు శాస్త్ర ప్రకారం వాస్తు నిపుణులు ఏం తెలియజేస్తున్నారు ఇప్పుడు చూద్దాం.అయితే మనం సంపాదించుకున్న డబ్బులు మొత్తం ఎక్కువగా బీరువాలోనే దాచుకుంటూ ఉంటాము..
ఇక ఇదే క్రమంలోనే లక్ష్మీదేవిని దాచేటువంటి స్థలం ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా, పవిత్రంగా ఉండాలట. ఏమాత్రం చెత్త ఉన్నా కూడా ఆ ఇంట లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. ఎవరి ఇంట్లో అయినా లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే కచ్చితంగా వారి ఇల్లు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక డబ్బులు దాచుకునే బీరువా విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలను పాటిస్తూ ఉండాలి.మనం డబ్బులు దాచెటువంటి బీరువాకి పొరపాటున కూడా అర్థం ఉన్నట్లయితే వారి ఇంట్లో ఆర్థిక కష్టాలు మొదలవుతాయట.ఎవరైనా బీరువా కి అర్థం ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అద్దం ముందు నిలబడి తయారవుతుంటారు.

అలా బీరువాలో మనం పెట్టిన డబ్బు,బంగారాన్ని అందులో ఉంచి మనం ఇలా తయారు అవ్వడం వల్ల, లక్ష్మీదేవి ఆగ్రహించి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేయడం జరుగుతుంది. అందుచేతనే ఎవరైనా బీరువాకి అద్దం ఉండకూడదని తెలియజేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా బీరువా లేకుండా కేవలం సెల్పులు ఉన్నవారు అయితే.. బంగారాన్ని, డబ్బులను ఎప్పుడు కూడా దక్షిణ, పశ్చిమల మధ్యలోనే ఉండే నైరుతి మూలలోనే వాటిని భద్రపరచుకోవడం మంచిదని కొంత మంది వాస్తునిపుణులు తెలియజేయడం జరిగింది.. లేదంటే ఒకవేళ బీరువా దగ్గరికి వెళ్లి రెడీ కావడం మానివేయడం మంచిదట. మీరు కూడా ఇలాంటి తప్పు చేస్తుంటే చేయొద్దండి.