Temples : ఇటీవల కాలంలో చాలా మంది ప్రశాంతత కోసం దేవాలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే మరి కొంతమంది పురాతన కట్టడాలను చూడడానికి దేవాలయాలను సందర్శిస్తూ మరికొంతమంది తమ కష్టాలను బాధలను తగ్గించు కోవడం కోసం దేవాలయాలను దర్శిస్తూ ఉంటారు. అయితే ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు.. ఎలా పిలిచినా కూడా ఆ ప్రాంతం మాత్రం పవిత్ర మైనదిగా హిందువులు భావిస్తూ ఉంటారు.. అయితే మనం దేవాలయంలో కి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయకూడదు. ఇకపోతే ప్రతి ఒక్కరు దేవాలయాలకు వెళ్తారు కాబట్టి మీకు తెలిసిన వారందరికీ ఈ ఆర్టికల్ లో వాట్సాప్ ద్వారా సేవ్ చేసి సమాచారాన్ని అందించగలరు
.ఇక అసలు విషయానికి వస్తే.. దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా స్నానం చేసి వెళ్ళాలి.. ఇక ఉతికిన దుస్తులను వేసుకొని దేవాలయం లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నిశ్శబ్దాన్ని పాటించాల్సి ఉంటుంది.ఆలయంలోకి వెళ్లి మాట్లాడకుండా మౌనంగా కూర్చొని భక్తి తో… భగవంతుడిపై విశ్వాసం ఉంచి శ్లోకాలు చదవడం మంచిది.. అది కూడా గట్టిగా కాకుండా మౌనంగా చదువుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ పట్టుకుని మాట్లాడడం, అక్కడ ఉండే వారి మీద చాడీలు చెప్పడం వంటివి చేయకూడదు.. తోటి భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించటం మంచిది కాదు.ఇంట్లో అరిష్టంగా ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్ళకూడదు. ముఖ్యంగా దేవాలయంలోకి వెళ్ళే టప్పుడు కుంకుమ పెట్టుకొని వెల్లడం మంచిది.
గుడిలోకి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పండును, పువ్వులను తీసుకొని వెళ్ళడం మంచిది.గుడిలోకి వెళ్ళిన తర్వాత ప్రదర్శనలు చేయకుండా డైరెక్టుగా దేవుని దగ్గరకు వెళ్ళకూడదు.. ఇక అంతే కాకుండా దేవాలయంలోకి బయట నుంచి తెచ్చిన తిండి పదార్ధాలను తినకూడదు.. అలా చేస్తే దేవాలయ పవిత్రతకు భంగం కలిగించినట్లు అర్థం.దేవాలయంలో నిర్దేశించిన నిబంధనలను పాటించి వస్త్రధారణనను మెయింటైన్ చేయాలి.చెప్పులు గుడి బయట వదిలి రావాలి. ముఖ్యంగా గుడిలో ఎక్కడపడితే అక్కడ కూర్చోకుండా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని కూర్చోవాలి. గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ భక్తులను గౌరవించడం మంచిది.