Pooja Room : పూజ గదిలో ఈ వస్తువులు ఉన్నాయా.. మంచిదా..కాదా..?

Pooja Room : ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుడి పూజ గదిని మనం ఏర్పాటు చేసుకుంటూనే ఉంటాము. ఈ పూజ గది ని మనం వాస్తు ప్రకారం కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటాము. ముఖ్యంగా పూజ గది ఏ మూలన ఉండాలి ఎంత హైట్ లో ఉండాలి అనే విషయంపై ఎన్నో నియమాలు పాటిస్తూ ఉంటాము. అలాగే పూజ తలపు పై ఎలాంటి గుర్తులు ఉండకూడదు.. ఎలాంటి గుర్తులు ఉండవచ్చు. ఇక దేవుడు పూజా మందిరానికి సంబంధించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం.

Are these objects in the pooja room
Are these objects in the pooja room

1).ముఖ్యంగా మనం పూజ చేసే గదికి ఎప్పుడూ తలుపు వేసి ఉంచాలట. అలా తలుపు లేనివారు ఖచ్చితంగా ఒక డోర్ కటన్ అయినా ఉపయోగించాలి. ముఖ్యంగా పూజగదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలట. పూజ అయిపోయిన కొద్ది నిమిషాల తర్వాత ఆ తలుపులు మూసి వేయాలి.

2).ముఖ్యంగా పూజగదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి. లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి కచ్చితంగా పూజగదిలో ఉంచుకోవాలి.

3). మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము. పూర్వపు రోజుల్లో ఇలా దేవుడు ఫోటోలు దగ్గర రాగి బిళ్ళలు, వెండి బిళ్ళలను మాత్రమే ఉంచేవారు. అయితే ఇప్పుడు ఉన్న కాయిన్స్ ని మాత్రం ఉంచకూడదు.

4) పూజ గదిలో ని ఫోటోలు వరుస సంఖ్యలో ముందుగా వినాయకుడి ఫోటోను ఉంచాలి. ఈ ఫోటో పెట్టిన తర్వాతే మిగతా ఫోటోలను ఎలాగైనా పెట్టుకోవచ్చు. మరి ముఖ్యంగా పూజ గదిలో ని ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు.

5). సూర్యాస్తమయం అయిన తరువాత దేవుడు గదిలో అసలు పూజ చేయకూడదట. వీటితో పాటుగా పూజ గదిలో చందనం అనేది ఉంచుకోవాలి.

6). దేవుడు గది ఎప్పుడూ చీకటిగా ఉండకుండా చూసుకోవాలి.

7). దేవుడి రూము లో పసుపు – కుంకుమ అనేది ఎప్పుడూ ఉండాలట. ఇక అక్షింతల విషయంలో మంచి బియ్యాన్ని తీసుకోవాలి విరిగిన బియ్యాన్ని తీసుకోకూడదు.

8). నైవేద్యంగా తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లం ని ఎక్కువగా ఉపయోగించుకోవడం మంచిదట. ఇక ప్రతి వారము పూజ చేసేవారు ఆ వాడిపోయిన పూలను ఏదైనా గంగలో కలపడం మంచిది.