Sri Krishna : ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు . అయితే ఈరోజు శ్రీ మహావిష్ణువుని మధుర లో కృష్ణుని రూపంలో భక్తులు ఆరాధిస్తారు. ఇక అక్కడి నుంచి గోకులానికి తీసుకువెళ్తారు . నిజం చెప్పాలంటే శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున శ్రీ కృష్ణుని జన్మదిన వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు భక్తులు. అంతేకాకుండా భక్తులు ఉపవాసం కూడా చేస్తారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని సుమారుగా వివిధ రకాల వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా ప్రసాదిస్తారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు అర్ధరాత్రి 12:00 తర్వాత జన్మించాడుకాబట్టి భక్తులు ఆ సమయంలో నూతన దుస్తులు ధరించి 56 రకాల భోగ సమర్పణలు చేస్తారు. అయితే ఈ పండుగ రోజు ఈ సాంప్రదాయం ఎందుకు పాటిస్తారు.. అనే విషయం కూడా ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం..
ఇక శ్రీకృష్ణుడిని పెంచిన తల్లిదండ్రులు యశోద, నందుడు తో కలసి కృష్ణుడు గోకులంలో నివసిస్తున్నప్పుడు అతని తల్లి యశోద ప్రతి రోజు ఎనిమిది సార్లు భోజనం తినిపించేది. ఇక ఒకసారి ప్రజలు ఇంద్రుడిని ఆరాధించేందుకు పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణుడు నందుడు ని ఈ కార్యక్రమం ఎందుకు అని అడుగుతాడు. ఇక ఇంద్రుడిని పూజిస్తే ఆయన సంతోషించి వర్షాలు బాగా కురిపిస్తాడని ఫలితంగా పంటలు బాగా పండుతాయని కన్నయ్యకి నందుడు సమాధానం ఇస్తాడు. మళ్లీ కృష్ణుడు మాట్లాడుతూ ఇంద్రుడు పని వర్షం కురిపించడమే అయితే ఆయనకెందుకు పూజలు చేయడం అని నందు డి తో అంటాడు.అవసరమైతే గోవర్ధన పర్వతాన్ని పూజించండి ఎందుకంటే ఇది పండ్లు , కూరగాయలు , జంతువులకు పచ్చి మేత ఇస్తుందని చెబుతాడు. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడు చెప్పినట్టు గా ఇంద్రుడిని ఆరాధించకుండా.. గోవర్ధన పర్వతాన్ని పూజించడం మొదలు పెడతాడు.
ఇక ఇంద్రుడు అవమానంగా భావించి బృందావన వాసులపై కోపోద్రిక్తుడవుతాడు. కోపంతో బృందావనం పై రాళ్ల వర్షం కురిపిస్తాడు ఇంద్రుడు ఈ కారణంగా ప్రతి చోట రాళ్ల తో పాటు నీరు కూడా ఉప్పొంగుతుంది. ఈ దృశ్యాన్ని చూసి బృందావన వాసులు భయాందోళనలకు గురి అయితే.. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేళ్లతో ఎత్తి బృందావనాన్ని రక్షిస్తాడు. ఏడు రోజులపాటు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను కాపాడతాడు..ఇక ఇంద్రుడు తన ఓటమిని అంగీకరించిన తరువాత బృందావన వాసులు పర్వతం నుండి బయటకు వచ్చారు. కృష్ణుడు ఏమి తినలేదు అని భావించిన బృందావన వాసులు తమను రక్షించినందుకు గాను రోజుకు ఎనిమిది సార్లు చొప్పున ఏడు రోజుల పాటు అంటే 56 వంటకాలను కృష్ణుడికి తినిపించారు. ఇక అలా ప్రతి కృష్ణాష్టమి రోజున 56 వంటకాలతో స్వామివారికి నైవేద్యం ప్రసాదిస్తారు. 20 రకాల సీట్లు, 16 రకాల కారాలతో కూడిన వంటలను, 16 రకాల డ్రై ఫ్రూట్ లను కూడా స్వామివారికి నైవేద్యంగా ప్రసాదిస్తారు.