Zodiac Signs : జూలై నెలలో బుధుడి స్థానం రెండుసార్లు మారుతున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారి దశ కూడా తిరగబోతోందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా జూలై 31వ తేదీన బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తున్న నేపథ్యంలో సింహరాశిలో బుధుని సంచారం మొత్తం 12 రాశుల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా బుధ గ్రహానికి రాజైన సింహంలో సంచరించే సమయంలో కొన్ని రాశుల వారు మంచి విజయాన్ని అందుకుంటారట . ఇంకొన్ని రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బుధుడు రాశి మారడం వల్ల ఏ రాశుల వారికి లాభం చేకూరుతుందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి బుధుడు సింహరాశి లోకి వెళ్లడం వల్ల అపారమైన ధనయోగం పట్టబోతోంది. ముఖ్యంగా వ్యాపారులకు, కొత్తగా బిజినెస్ మొదలు పెట్టిన వాళ్లకు ఈ సమయం చాలా మంచి సమయమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కాలంలో పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండి చిన్న పెట్టబడులను మాత్రమే పెట్టి మరింత లాభాలను సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి కూడా కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీ మాటలను అదుపులో పెట్టుకుంటే మరింత లాభాలను పొందవచ్చు.
కన్య రాశి : కన్యా రాశి వారికి బుధుడు సింహరాశి రెండో ఇల్లు అవుతుంది. ముఖ్యంగా బుధుడు రాశి మారడం వల్ల మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకపోతే ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాశం ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడం వల్ల మీ సంసారం మరింత బలపడుతుంది.
వృశ్చిక రాశి : ఇక ఈ రాశుల వారికి పూర్వీకుల నుంచి ఆస్తి కలిసొచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆకస్మిక ధన లాభం చేకూరే అవకాశాలు ఎక్కువ. ఇక వీరు ఏం చేయకపోయినా సరే ధనలక్ష్మి వీరిని వెతుక్కుంటూ వస్తుందని పండితులు చెబుతున్నారు. మీ స్వభావంలో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ కుటుంబ జీవితం మెరుగుపడుతుంది.
మకర రాశి : బుధుడు సంచారం వల్ల మకర రాశి వారికి కొన్ని ఇబ్బందులను ఎదురైనా ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగుపడుతుంది .ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క భావాలను మీరు విస్మరించకూడదు. లేకపోతే గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.