Abhigya : ఈమధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒకే ఒక్క పేరు అభిగ్య ఆనంద్.. కొన్ని నెలల క్రితం తను చెప్పిన జ్యోతిష్యం అక్షరాల ఫలించడంతో.. ఇప్పుడు అందరు దృష్టిలో అభిగ్య హీరో అయిపోయాడు.. కలియుగ బ్రహ్మం గారి లాగా మారిపోయాడు. అతను చెప్పేది నిజమేనా జ్యోతిష్యంలో అతనికి అంత పాండిత్యం ఉందా అని హేతువాదులు, విదేశీయులు సైతం ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.. అసలు అభిగ్య ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
అభిగ్య ఆనంద్ అనే ఈ కుర్రాడి వయసు సరిగ్గా 15 సంవత్సరాలు . 14 ఏళ్లకే బ్రహ్మంగారిలా మారిపోయి కాలజ్ఞానం చెప్పేశాడు. దాంతో సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యాడు. అతనిది మైసూర్. తండ్రి ఆనంద్ రామసుబ్రహ్మణ్యం, తల్లి అన్ను ఆనంద్. చిన్న వయసులోనే జ్యోతిష్య శాస్త్రాన్ని అవపోసాన పట్టడం ఈ పిల్లాడి ప్రత్యేకత. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే మేధావి, ఏకసంతాగ్రహి.. ఇప్పటికే వేదాలు చదివేశాడు. బహుభాషా ప్రావీణ్యుడు. గ్రహ స్థితులను బట్టి భవిష్యత్తులో జరిగేవి ముందుగానే చెప్పేస్తాడు. చాలామంది అది అలా సాధ్యమని అనుకుంటారు.
అభిగ్య చాలా క్లియర్ గా చెబుతూ ఉంటాడు. ఆఖరికి తేదీలతో సహా ముందుగా జరిగేవన్నీ చెప్పడంతో అందరూ అభిగ్య చెప్పింది నిజమని ఒప్పుకోక తప్పలేదు. ప్రతి ఏడాది పంచాంగం శ్రవణం ప్రకారం మన భవిష్యత్తు ఎలాగ ఉంటుందో రాశుల ప్రకారం చెబుతూ ఉంటారు పండితులు. ఎవ్వరూ కూడా కరోనా వైరస్ గురించి చెప్పింది లేదు.. కానీ అభిగ్య మాత్రం గత ఏడాది 2019 ఆగస్ట్ లోనే ఈ వైరస్ గురించి చెప్పు మరి ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. అప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. 2020 లో బయోలాజికల్ వార్ జరుగుతుందని చెప్పాడు. డేట్ తో సహా మెన్షన్ చేసి చెప్పడం అభిగ్య స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు.
చైనా ఇబ్బందులకు గురవుతుందని చెప్పాడు. జనాలు ఎక్కడికి అక్కడే ఇళ్లకే పరిమితం అవుతుందని చెప్పాడు. భయంకరమైన వింత వ్యాధి వస్తుందని తను ముందుగానే చెప్పాడు. 2019 మే నుంచి 2020 ఏప్రిల్ వరకు ప్రపంచం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని అభిగ్య చెప్పాడు. ప్రపంచ వైమానిక రంగం విపరీతంగా దెబ్బతింటుందని తెలిపాడు. ధనిక దేశాలుగా చెప్పుకునే అన్ని దేశాలు అతలాకుతలం అవుతాయని చెప్పాడు. ముఖ్యంగా మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 మధ్య తీవ్ర పరిణామాలు ఉంటాయని అభిగ్య వీడియోలో చెప్పారు. ఇప్పుడు అదే వీడియోను మరోసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.