Naga Chaitanya – Samantha : ఇన్ని నెలల తరవాత సమంత – నాగ చైతన్య ల విడాకులకి అసలు కారణం తెలిసింది ..

Naga Chaitanya – Samantha : సినీ ఇండస్ట్రీ అంటేనే గాసిప్స్.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు గా వారి జీవితాలను ప్రభావితం చేసే విధంగా రకరకాల పుకార్లు బయటకు వస్తాయి.. ఇక హీరో హీరోయిన్స్ ఇద్దరు ప్రేమలో ఉన్నప్పటి నుంచి పెళ్లి జరిగే వరకు ఏదో ఒక వార్త రోజు సోషల్ మీడియాలో మెదులుతూనే ఉంటుంది.. అలాంటిది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకుంటే ఇంకా ఎన్ని కథలు అల్లవచ్చు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆ జంట ఇంకెవరో కాదు అక్కినేని నాగచైతన్య సమంత.. వీళ్లిద్దరూ ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ల పర్సనల్స్ కారణంగా విడీపోయారు.. ఆ కారణం ఏంటో బయటకు చెప్పకపోవడంతో.. మీడియాలో రోజుకో పుకారు షికారు చేస్తోంది.. ఇప్పుడు తాజాగా వీళ్ళిద్దరూ విడిపోవడానికి ఓ లేడీ విలన్ ని సృష్టించి.. ఈవిడ వలనే సమంత నాగచైతన్య విడిపోయారు అంటూ.. ఓ పనికిమాలిన వార్తని విందు భోజనంగా వండి వార్చేశారు.. దాంతో ఆ న్యూస్ వైరల్ అవ్వడంతో అందరూ.. ఈ న్యూస్ చదివి ఆహా ఓహో అనుకుంటున్నారు..!!

ఏ మాయ చేసావే సినిమా లో నటించిన నాగచైతన్య సమంత క్రేజీ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆ సినిమాతోనే వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు.. ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు.. ఏమైందో ఏమో తెలీదు.. సడన్ గా విడాకులు తీసుకుంటున్నామంటు అనౌన్స్ చేశారు.. అప్పటినుంచి సోషల్ మీడియాలో విడాకులకు ఇదే కారణం అంటూ రోజుకో గాసిపు బయటకు వస్తుంది.. నాగార్జున కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయమని చాలాసార్లు చెప్పారు.. కానీ మీడియా మాత్రం వదలడం లేదు.. తాజాగా నాగచైతన్య సమంతలకు ఆ ఇద్దరి గొడవే కారణం.. అని అంటూ ఓ కథ చక్కగా అల్లేసారు.. ఇంతకీ ఆమె ఎవరో కాదు నాగార్జున మేనకోడలు యార్లగడ్డ సుప్రియ.. చరణ్ రెడ్డి సుప్రియ ఇద్దరు కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆ సినిమాతో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు..

Yarlagadda Supriya is reason for Samantha Naga Chaitanya divorce
Yarlagadda Supriya is reason for Samantha Naga Chaitanya divorce

వీళ్ళు ప్రేమించి వివాహం చేసుకున్నారు కొన్ని కారణాలవల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు.. ఆ తర్వాత చరణ్ రెడ్డి వ్యసనాలకు బానిసై చనిపోయారు.. కొన్ని సంవత్సరాల పాటు సుప్రియ ఇండస్ట్రీకి దూరమైంది.. చానా కాలం తర్వాత సుప్రియ గూడచారి సినిమాతో మళ్లీ వెండి తెరపై కనిపించింది.. ఆ సినిమాలో హీరోగా నటించిన అడవి శేషు తో ఆమె ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారట.. కానీ ముందు నుంచి సుప్రియ కు సమంతకు ఒకరికి ఒకరు అంటే పడదట.. అందుకే ఈ పెళ్లి జరగకూడదని సమంత అడ్డుపడిందట.. అదే నాగచైతన్యతో సమంత దూరమవడానికి కారణమైందని.. చివరకు వాళ్ళ పెళ్లి పటాకులు అయ్యేలాగా చేసింది అని ఒక కథ చక్కగా క్రియేట్ చేసారు.. ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో రావడం షరామములే.. ఇవన్నీ వైరల్ అవ్వడం కూడా అంతే నిజం.. కానీ ఈ వార్తలో నిజం లేదనేది మాత్రం వాస్తవం..