Mahesh Babu : మహేష్ బాబు కి మరోసారి ఈ హీరోయిన్ కలిసొస్తుందా.!?

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ సినిమా మహర్షి.. సందేశాత్మక చిత్రాలను ఎంపిక చేయడంలో టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు.. ఈ తరహాలో మహేష్ పూజ హెగ్డే జంటగా తరుకెక్కిన చిత్రం మహర్షి.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మహేష్ కెరియర్ లో మొదటిసారి 100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసింది.. ప్రస్తుత సమాజంలో రైతు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.. మనం రైతులపై చూపించాల్సింది జాలి కాదు మర్యాద అనే సబ్జెక్టుకి అన్ని రకాల కమర్షియల్ హంగులను అద్ది ప్రేక్షకులకు వడ్డించాడు దర్శకుడు.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి చిత్రాన్ని బ్రేక్ చేస్తూ ఓవర్సీస్ లో 2500 పైగా ప్రీమియర్ షో లను ప్రదర్శించారు.. టాలీవుడ్ హిస్టరీలో సెకండ్ బిగ్గెస్ట్ రిలీజ్ మూవీ మహర్షి కావడం విశేషం..! ప్రీమియర్ షో ద్వారా పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టిన మహర్షి చిత్రం యూఎస్ లో మంచి కలెక్షన్లను వసూలు చేసింది..

2019లో ప్రీమియర్స్ ద్వారా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన చిత్రంగా రికార్డులను నెలకొల్పింది.. మహర్షి చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.. 101 కోట్ల షేర్ వచ్చింది.. మొత్తంగా ఈ చిత్రం హిట్ లిస్టులో చేరింది.. టాలీవుడ్ ఆల్ టైం టాప్ ఫైవ్ గా ఈ చిత్రం నిలిచింది.. నైజంలో ఈ చిత్రానికి మంచి లాభాలు వచ్చాయి అదేవిధంగా నాన్ బాహుబలి రికార్డులను కూడా దక్కించుకుంది.. 25వ చిత్రంతో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఎన్టీఆర్ల నాన్నకు ప్రేమతో చిత్రాలు ఆశిస్తూ రాణించలేకపోయాయి కానీ మహేష్ 25వ చిత్రం మాత్రం హిట్ గా నిలిచింది.. మహేష్ 25వ చిత్రం తనకు బాగానే కలిసి వచ్చింది.. మొదటిసారి దూకుడు సినిమాతో 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మహేష్ బాబు.. ఆ తరువాత శ్రీమంతుడు, స్పైడర్, భరత్ అనే నేను చిత్రాలకు వందకోట్ల చేయడం విశేషం.. ఇక మహర్షి కూడా 100 కోట్ల క్లబ్లో నిలిచి 5వ చిత్రం గా నిలిచింది.. ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్స్ వసూలు చేసిన చిత్రాలు మహేష్ బాబు 9 ఉండడం విశేషం.. అందులో మహర్షి తొమ్మిదవ చిత్రం.. ఇది మహేష్ బాబు క్రేజ్ కు నిదర్శనం.

Workout Mahesh Babu has Pooja Hegde Centiment
Workout Mahesh Babu has Pooja Hegde Centiment

ఇక ఈ సినిమాతో మహేష్ బాబుకు మే నెల కలిసి రాదన్న సెంటిమెంటును బ్రేక్ చేశాడు. మొత్తానికి ఒక్క మహర్షి సినిమాతో మహేష్ బాబు ఎన్నో రికార్డులను క్రియేట్ చేసారు. థియేటర్లో ఊపు ఊపేసిన మహర్షి టీవీలో మాత్రం మొదట్లో టెలికాస్ట్ చేసినప్పుడు ఊహించిన స్థాయిలో టిఆర్పి రేటింగ్ రాలేదు.. కానీ పదో సారి టెలికాస్ట్ కాగ అదిరిపోయే టిఆర్పి రేటింగ్ వచ్చింది.. మళ్ళీ మళ్ళీ మహర్షి చూడటం తో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.. మహర్షి సినిమాకు ఆ స్టామినా ఉందంటూ ఫాన్స్ అప్పట్లో హల్చల్ చేశారు.. మహేష్ నటించిన అతడు చిత్రం కూడా ఇదే తరహాలో మొదట మెల్లగా ప్రారంభమై ఆ తర్వాత టీవీ ప్రేక్షకులను కట్టిపడేసిన సంగతి తెలిసిందే.. మహేష్ నటించిన మహర్షి సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్.. ఇక తాజాగా తెరకెక్కబోతున్న మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో హీరోయిన్ కూడా పూజ హెగ్డే నే.. దాంతో ఈ సినిమా కూడా హిట్ అయ్యిద్ది అనే టాక్ సోషల్ మీడియాలో హట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది.. మరి బుట్ట బొమ్మతో మరోసారి మహేష్ బాబు ఎన్ని రికార్డ్స్, కలెక్షన్స్ కొల్లగొడతాడో లేదో చూడాలి..

Advertisement