Mahesh – Tarak : టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్ , ఎన్టీఆర్ అంచనాలను మించి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు . మాస్ ప్రేక్షకులలో ఈ ఇద్దరి హీరోలకు ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉండగా క్లాస్ ప్రేక్షకులలో కూడా అంతకుమించి క్రేజ్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా వారి విజయానికి నాంది అని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా అన్ని వర్గాల ప్రేక్షకులను తన సినిమాలతో అలరిస్తూ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు మంచి క్రేజ్ ను కూడా సొంతం చేసుకునే దిశగా ఈ హీరోలు అడుగులు వేస్తున్నారు.. ఇకపోతే మహేష్ బాబు ఈ ఏడాది డిసెంబర్ నుంచి రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. మరొకవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్లో కూడా డిసెంబర్ నుంచి పాల్గొనబోతున్నారు.
ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు డిసెంబర్లోనే షూటింగ్ మొదలు కాబోతున్నాయి.. నిజంగా డిసెంబర్ లో షూట్ మొదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు అదే సెంటిమెంటును రిపీట్ చేస్తున్నారు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అటు రాజమౌళి ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరు కూడా స్టార్ డైరెక్టర్లే.. కాగా ఈ రెండు సినిమాలలో ఏ సినిమాపై చేయి సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
ఇద్దరు హీరోల పారితోషకం వేరువేరుగా రూ. 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది . ఇద్దరూ కూడా తమతో పని చేసిన డైరెక్టర్లను మార్చుకుంటున్నారని కొంతమంది సరదాగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ ఇద్దరికీ డిసెంబర్ ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి.