Nagarjuna : టలీవుడ్ గత ఏడాది చాలామంది సీనియర్ నటులు కాలం చేశారు. అలనాటి తరం లోని దిగ్గజ నటులు మరణించారు. కృష్ణంరాజు, సూపర్‌స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావులు లాంటి సీనియర్ నటులు కన్నుమూశారు. సినీ పరిశ్రమ అంతా నివాళి అర్పించింది.. కానీ నాగార్జున వారిని కడసారి చూడటానికి వెళ్ళలేదు.. కానీ అక్కినేని కుటుంబం నుంచి అఖిల్, చైతన్య వెళ్ళారు. దిగ్గజ నటులు చనిపోయినా నాగార్జున వారిని కడసారి చూడటానికి వెళ్ళకపోవడం పై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అక్కినేని నాగేశ్వరరావు మరణించినప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం ఘనమైన వీడ్కోలు ఇచ్చింది. ఆయన భౌతిక కాయాన్ని చూసిన అంతా కన్నీరు పెట్టుకుంటునే నాగార్జున కి ధైర్యం చెప్పారు. నాగార్జున కు సినీ ఇండస్ట్రీలో ప్రతి నటుడితో పరిచయం ఉంది. నేటి తరం, నిన్నటి తరం, కొత్త తరంతో ఆయనకు మంచి అనుబంధము ఉంది. అయినా తన తండ్రి తరం వారు.. అప్తులైన వారు మరణిస్తే కడచూపుకి కూడా వెళ్లడం లేదు.
నాగార్జున తోపాటు కైకాల సత్యనారాయణ పలు సినిమలలో కలిసి నటించారు. ఆయన సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కామెడీ విలన్‌గా ఎన్నో పాత్రలు చేశారు. ఏఎన్ఆర్‌కు కైకాల ఆప్తమిత్రుడు. అప్పుడు నాగార్జున స్పందించలేదు. వారసుడు అనే సినిమాలో కృష్ణ నాగార్జున కలిసి నటించారు. అయినా టాలీవుడ్ సూపర్ స్టార్ మరణంపై నాగార్జున పెద్దగా స్పందించలేదు. భౌతికకాయం సందర్శించలేదు.
అలాగే కృష్ణంరాజు చనిపోయినా నాగార్జున ఇలాగే ప్రవర్తించాడు. నాగార్జున ఇలా మరణించిన పెద్దల భౌతిక దేహాలను సందర్శించి నివాళులు అర్పించకపోవడానికి కారణం చనిపోయిన వ్యక్తులను చూడాలంటే భయమా.. లేదంటే పార్థీవదేహాలను సందర్శించడం అపశకునంగా భావిస్తున్నారా.. అనే సందేహాలు ఫాన్స్ లో కలిగాయి.. ఈ ప్రశ్నలకు నాగార్జున నే సమాధానం చెప్పాలి. అయితే నాగర్జున అలా స్పందించక పోవడానికి కచ్చితంగా ఓ బలమైన కారణం ఉందట.