Vijay devarakonda: విజయ దేవరకొండా – సమంత ఇద్దరికీ మధ్యలో ‘ఆ అమ్మాయి’ ఎందుకు వచ్చింది అసలు.!?

Vijay devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సమంత జంటగా శివ నిర్వాణతో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.. శివ నిర్వాణ సినిమా అంటేనే హుందాగా ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రస్.. ఈమె సినిమా లో హృదయాలకు హత్తుకునే విధంగా ఉంటాయి.. తాజాగా ఈ సినిమా కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఓ ప్రముఖ హీరోయిన్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.. ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక కీలక పాత్రలో నటించేందుకు రాశి ఖన్నా సెలెక్ట్ చేస్తున్నట్లుగా సమాచారం..!

అయితే అధికారకంగా ఇంకా ఈ ప్రకటన విడుదల కాలేదు.. ఈ వార్త కనుక నిజమైతే విజయ్ దేవరకొండ సమంత కలిసి నటిస్తున్న సినిమాలో రాశి కన్నా పాత్ర ఎలా ఉండ బోతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.. రాశి కన్నా ఇటీవల గోపీచంద్ సరసన కమర్షియల్ సినిమాలో నటించింది కానీ ఆ సినిమా ఊహించని స్థాయిలో అందుకోలేదు కానీ రాశి కన్నా కు మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.. ఒక్కసారి విజయ్ దేవరకొండ సరసన నటిస్తే ఆమెకు ఇకనుంచి అన్ని మంచి ప్రాజెక్ట్ వస్తాయని అంతా అనుకుంటున్నారు.. శివ నిర్వాణ రాశి ఖన్నా ను ఎలా చూపిస్తాడా అని అంతా అనుకుంటారు..

Why did 'that girl' come between Vijaya Devarakonda and Samantha
Why did ‘that girl’ come between Vijaya Devarakonda and Samantha

ఈ సినిమా సెకండ్ హాఫ్ లో రాశి ఖన్నా క్యారెక్టర్ చాలా అందంగా ఉండబోతుందట.. నెగిటివ్ షేడ్స్ తో ఈమె క్యారెక్టర్ ముందుకు తీసుకు వెళ్లనున్నడట డైరెక్టర్.. ఇక ఇదే క్యారెక్టర్ తో ఈ సినిమా చివరి వరకు ఎమోషనల్ గా టర్న్ తీసుకుంటుందట.. అది ఎలా మలుపు తిరుగుతుంది.. రాశి కన్నా ప్రేమ విషయంలో పూర్తి పాజిటివ్ క్యారెక్టర్ గా ఎలా మారింది.. ఎలా ఈ క్యారేక్టర్ అందరినీ మెప్పిస్తుంది అనే కోణంలో రాశి కన్నా పాత్ర సాగుతుందట.. ఈ సినిమా ఓ మెచ్యూర్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. శివ నిర్వాణ సినిమా అంటేనే ప్రేమ కథ చిత్రం.. మజిలీ, నిన్ను కోరి, హృదయాన్ని హత్తుకునే విధంగా ప్రేక్షకుల్ని అల్లరించటంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి.