BalaKrishna : ఇటీవల కాలంలో అన్నీ మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవిని మొదలుకొని ఆయన వారసులు రామ్ చరణ్, ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్కరూ మల్టీ స్టారర్ మూవీలు చేస్తూ దూసుకుపోతున్నారు. వెంకటేష్, నాగార్జున , చిరంజీవి వీళ్లంతా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే.. బాలయ్య మాత్రం ఇంకొక హీరో తో స్క్రీన్ షేర్ చేసుకోకపోవడంతో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బాలయ్య సినిమాలు చేయకపోవడానికి ఏదైనా కారణం ఉందా ? లేక అలాంటి సందర్భం రాలేదా? అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. బాలయ్య కూడా గతంలో ఒకటి , రెండు మల్టీ స్టారర్ సినిమాలలో నటించినా.. పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడం వల్లే ఆయన మళ్లీ మల్టీ స్టారర్ సినిమాలకు ఆసక్తి చూపించడం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. బహుశా అందుకేనేమో బాలయ్య మల్టీస్టారర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ రాబోయే రోజుల్లో మంచి పాన్ ఇండియా సినిమా మల్టీస్టారర్ గా వస్తే చేస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఈయన నటించిన వీర సింహారెడ్డి సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. మరొక పక్క ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.