Kajal Agarwal : షూటింగ్ మధ్యలో హీరోయిన్ కాజల్ దవడ పగలగొట్టిన డైరెక్టర్ !

Kajal Agarwal :Kajal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో కాజల్ కూడా ఒకరు.. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. స్టార్ అయ్యాక బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ పట్టి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది.. రెండు తరాల టాలీవుడ్ హీరోలను కవర్ చేసిన అదురైన హీరోయిన్స్ లో కాజల్ కూడా ఒకరు. ఎన్టీఆర్, మహేష్, పవన్ , అల్లు అర్జున్, ప్రభాస్ లతో నటించరు. అలాగే చిరంజీవితో కూడా జత కట్టారు.. తాజాగా బాలయ్య 108 సినిమాకి సైన్ చేశారు

Which director hit Kajal Agarwal
Which director hit Kajal Agarwal

. 15 ఏళ్లుగా ఆమె ప్రస్థానం సాగుతోంది. పెళ్లయిన ఒక బిడ్డకు తల్లి అయినా ఆమె క్రేజ్ ఇంకా తగ్గలేదు..

 

 

కాజల్ ఓ దర్శకుడు చేతిలో దెబ్బలు తిన్నారనే వాదన ఉంది. హీరోయిన్ గా కాజల్ మొదటి సినిమా లక్ష్మీ కళ్యాణం.. 2007లో విడుదలైన ఈ చిత్రానికి తేజ డైరెక్టర్ గా వ్యవహరించారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్ ను అందుకుంది. సాధారణంగానే డైరెక్టర్ తేజ కి కోపం ఎక్కువ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. విసిగించిన యాక్టర్స్ పై పలు సందర్భాల్లో చేయి చేస్తున్నారని కూడా వార్తలు వినిపించాయి.. అందులోనూ తేజ కొత్త నటులతో చేస్తారు. స్టార్స్ అయితే ఆయన గట్టిగా చెప్పలేరు.

 

 

కొత్త వాళ్లను తనకు నచ్చినట్లుగా మలుచుకుని బెస్ట్ అవుట్ పుట్ తీసుకురావాలని తేజ ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విషయం ఒకటి రెండు సందర్భాల్లో కూడా తెలిపారు. కొత్త వాళ్ళు బెటర్ అంటారు. అయితే వాళ్లతో ఓ చిక్కు కూడా ఉంది. నటన మీద అంత అవగాహన ఉండదు.

 

కెమెరాను ఎలా ఫేస్ చేయాలి? ఎలా నిల్చోవాలి.. డైలాగ్ ఎలా చెప్పాలి.. అంటే బేసిక్స్ కూడా తెలియకపోవచ్చు. ఈ క్రమంలో బాగా విసిగించిన హీరో హీరోయిన్స్ ని తేజ కొట్టారనేది ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.. తేజ చేతిలో దెబ్బలు తిన్న హీరోయిన్స్ లో కాజల్ కూడా ఒకరట.. లక్ష్మీ కళ్యాణం సినిమాలో హీరోయిన్ ప్రేమను తండ్రి అంగీకరించడు. ఆమెకు వేరే హీరోతో పెళ్లి చేయాలి అనుకుంటారు. కాజల్ పాత్రకు ఏడ్చే సన్నివేశాలు చాలా ఉంటాయి. కాజల్ కి అసలు ఏడుపు రావడం లేదట. ఎంతకీ ఎమోషన్ పలకకపోవటంతో విసిగిపోయిన తేజ అందరూ ముందే కాజల్ చెంప చెల్లుమనిపించారు. దాంతో కాజల్ ఏడవడం ఆ సీన్ అద్భుతంగా రావడం జరిగాయని సమాచారం.

 

 

కాజల్ పై తేజ చేసుకున్నాడనే వాదన ఉంది. అయితే దీన్ని ఓ సందర్భంలో కాజల్ ఖండించారు. నాకు ఏడుపురాని మాట వాస్తవమే కానీ తేజ కొట్టలేదు. ఆయన సహనంగా చెప్పారు. లక్ష్మీ కళ్యాణం నాటికి అసలు నాకు నాటనలో ఓనమాలు కూడా తెలియవు. చిన్నప్పటి నుండి బాధ అంటే ఏమిటో తెలియకుండా పెరగను దాని వలన నాకు ఏడవటం కూడా రాదు. తేజ గారు అన్ని చెప్పి చేయించుకున్నారని కాజల్ తెలిపారు.