Mahesh Babu Fans : రాజమౌళి ఆ మాట చెప్పగానే.. పూనకం తో ఊగిపోతోన్న మహేష్ బాబు ఫ్యాన్స్.!

Mahesh Babu Fans : దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తరువాత.. తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమా కోసం రాజమౌళి, మహేష్ అభిమానులు 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.. వీరి కాంబినేషన్లో సినిమా చేస్తే చూడాలని అంతా అనుకుంటున్నారు.. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!

When Rajamouli said that, Mahesh Babu's fans craze
When Rajamouli said that, Mahesh Babu’s fans craze

తాజాగా ఓ ఇంటర్నేషనల్ తో మాట్లాడిన రాజమౌళి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆర్ఆర్ సినిమాతో పాటు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబు సినిమా గురించి కొన్ని ప్రశ్నలు వేయగా.. రాజమౌళి వాటికి స్పందిస్తూ.. ఇప్పటివరకు నేను తీసిన సినిమాలు ఒక లెక్క.. ఇప్పుడు మహేష్ బాబు తో తీసే సినిమా మరో లెక్క అంటూ మాట్లాడారు.. మహేష్ బాబుతో తీసే సినిమా ఇప్పటివరకు నేను తీసిన అన్ని సినిమాలకంటే కూడా బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుందని.. ఈ సినిమా గ్లోబల్ ట్రొట్టింగ్ యాక్షన్ సినిమా కానుందని రాజమౌళి ఇండైరక్ట్ గా క్లు ఇచ్చారు.. ఈ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది అన్న రాజమౌళి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. మహేష్ బాబు సినిమా పై రాజమౌళి ఇలా స్పందించడం పై మహేష్ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు..

 

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రానున్న సినిమా యాక్షన్ అడ్వెంచర్ గా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కుతుందని రాజమౌళి ముందుగానే అప్డేట్ ఇచ్చారు.. అయితే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ చూస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమా కోసం సిఏఏతో అగ్రిమెంట్ చేసుకున్నారు.. అంటే కచ్చితంగా ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఎవరో ఒకరు కచ్చితంగా ఉంటారని తెలుస్తోంది.. రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పనులలో బిజీగా ఉన్నారు..