Waltair veerayya : “వాల్తేరు వీరయ్యకు” దారి చూపించిన గాడ్ ఫాదర్!!

Waltair veerayya : చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ప్రచారం విషయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నారో మనందరికీ తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతూన్న కూడా యూనిట్ సరిగ్గా ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదని… ఏ ఈవెంట్ కూడా సరైన ప్లాన్ తో చేయలేదని మీడియా సినిమా టీమ్ కే సలహా ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో చిరంజీవి సైతం మీడియాపై రియాక్షన్ అంతే సీరియస్ గా ఇవ్వడం జరిగింది.
ప్రచారం ఎలా చేసుకోవా లో మీడియా మాకు చెప్పాల్సిన పని లేదని ..మా సినిమా గురించి ఎలా ప్రచారం చేసుకోవాలో మాకు తెలియదా? అంటూ స్వీట్ గా రివర్స్ పంచ్ వేయడం కూడా జరిగింది.

Advertisement
waltair-veerayya way to god father
waltair-veerayya way to god father

ఇక ఇలాంటి సమస్యలు మళ్లి తలెత్తకుండా వాల్తేరు వీరయ్య ముందుగానే జాగ్రత్త పడినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకి దర్శకుడిగా ఉన్న బాబి అనుమతి లేకుండా ప్రచారం విషయంలో ఏ పని జరగడానికి వీలు లేదని సీరియస్ గా పీఆర్ టీమ్ కి చెప్పినట్టు గా తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన వీరయ్య ప్రచార చిత్రాలతో సినిమాకి భారీ హైప్ రావడం తో పాటు అంత కంత కు అంచనాలు పెరిగిపోతున్నాయి. చిరంజీవి మాస్ లుక్ అభిమానుల్లో ఆనందాన్ని మరింత పెంచేసింది. కాబట్టి ఇలాంటి సమయంలో ప్రచార విషయం లో ఎలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలంటే ఆ పనులు కూడా తన ప్లానింగ్ ప్రకారమే చేసేందుకు బాబి రంగం లో కి దిగినట్లు సమాచారం. ఇక త్వరలో లిరికల్ సింగిల్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేయడానికి ఎప్పుడు ఎలా రిలీజ్ చేయాలి అనేది బాబి ముందుగానే ఓ ప్లాన్ ఇచ్చి ఆ విధం గా నే రిలీజ్ చేయాలి అని పీఆర్ టీమ్ కి సూచించారంటా.

Advertisement

జనవరి లో సినిమా రిలీజ్ కాబట్టి ఆ తేదీని బట్టి ప్రచారం పనులన్నింటిని ఓ లిస్ట్ లో ఇచ్చి దాని ప్రకారం జరగాలి అని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడే వరకు ప్రేక్షకులు సినిమా పై అటెన్షన్ ఉండాలంటే, వారి మైండ్ లో వీరయ్య నలగాలని అప్పటి వరకు వీరయ్య అప్ డేట్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవాలని చెప్పారట. అంతే కాదు టీమ్ కి ఇంటర్వ్యూలు కూడా ప్లానింగ్ ప్రకారం జరిగేలా చూస్తున్నారు.

Advertisement