Waltair Veerayya : వాల్తేరు వీరయ్య వచ్చేది అప్పుడేనట!!

Waltair Veerayya : మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా కి సంబందించిన పూజా కార్యక్రమం కూడా ముగిసింది. పూర్తి మాస్ ఎంటర్టేనర్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో శృతి హాసన్ కూడా పాల్గొనడం జరిగింది . ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా రవితేజ కూడా చిరంజీవితో కాంబినేషన్‌ సీన్స్ షూట్ కోసం డేట్స్ ఇవడం కూడా జరిగిందట.

Waltair Veerayya release date
Waltair Veerayya release date

ఇది ఇలా ఉండగా వాల్తేరు వీరియ్యవిడుదల తేదీని మేకర్స్ ప్రకటించేసారు. జనవరి 13న రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రావలిసి ఉంది. ఈ సినిమా షూటింగ్ అత్యంత వేగం గా జరుగుతుంది. ఇందులో భాగం గా.. నేషనల్‌ అవార్డు విన్నర్‌ అయిన బాబీ సింహా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమా లో ఆయన విలన్ రోల్ చేస్తున్నారు. సింహా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చాలా పవర్‌ఫుల్ గా ఉండటం తో అది మెగా ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసింది. ఈ మెగా 154 కథ ఫుల్లు మాస్ కమర్షియల్ కంటెంట్ తో ఉంది అని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. పర్ఫెక్ట్ అవుట్ పుట్ కోసం తగ్గేదెలా అనేవిధం గా యూనిట్ మొత్తం శ్రమిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా కి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా లో చిరంజీవి, రవితేజ ల మాస్ సాంగ్ కూడా ఉండనుందంట. 2023 జనవరి 13 వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ సినిమా ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు అని తెలియవస్తుంది. ఈ సినిమా పై కొండంత ఆశలు పెట్టుకున్నా మెగా ఫాన్స్ “వాల్తేరు వీరయ్య “ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి డ్యుయల్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ కారణం గానే శృతిహాసన్‌ తో పాటు సీనియర్ నటి సుమలత కూడా కనిపించ బోతునట్టుగా సమాచారం. ఇక మెగా స్టార్ ఈ సినిమా తో తన అభిమానులకు ఏ రేంజ్ లో ట్రీట్ ఇవ్వనున్నారో తెలియాలి అంటే మాత్రం కొద్దీ రోజులు ఆగవలిసిందే.