K Viswanadh : టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి తెలుగు కళామ్మ తల్లికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి.. ఆయన తీసిన అన్ని క్లాసిక్ చిత్రాలు టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియా వైట్ గా కూడా ఏ డైరెక్టర్ తీయలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ఆ తరహా సినిమాలో విశ్వనాథ్ మాత్రమే తీయగలరు అనే బ్రాండ్ మార్కుని ఏర్పాటు చేసుకున్న మహానుభావుడు ఆయన.. అంతటి దిగ్గజ దర్శకుడు లెజెసీ ని కొనసాగించేందుకు విశ్వనాథ్ కుటుంబంలో ఎవ్వరు లేరా.!? ఇండస్ట్రీలోకి రావాలనుకోలేదు!?

విశ్వనాధ్ గారికి కాశీనాధుని నాగేంద్రనాథ్, కాశీనాధుని రవీంద్రనాథ్ అనే ఇద్దరు కొడుకులు.. పద్మావతి దేవి అనే కూతురు ఉంది. చిన్నప్పటి నుంచి ఇద్దరు కొడుకులకు విశ్వనాథ్ గారి లాగానే దేవుడు మీద విపరీతమైన భక్తి ఉండేది. అమితాశక్తి మొత్తం దేవుడి పైన చెప్పేవారట. అంతేకాదు చదువులో కూడా వీళ్ళిద్దరూ మెరిట్.. వారి అభిరుచులను గమనించిన విశ్వనాథ్ కచ్చితంగా నాకులగా సినిమాల్లో అయితే రారు అని అనుకున్నారట.
ఆయన అనుకున్నట్టుగానే తన కొడుకులు ఇద్దరు వ్యాపార రంగంలో స్థిరపడిపోయారు. ఇవన్నీ విశ్వనాథ్ గారు బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన విశేషాలు. విశ్వనాధ్ చనిపోయిన తరువాత ఆయన కొడుకు తండ్రి పార్థివదేహాన్ని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ పలకరించారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక విశ్వనాధ్ కొడుకులు వ్యాపారంగంలో స్థిరపడిపోవడం వల్ల ఆయన లెజసీని కొనసాగించడానికి ఆయన కుటుంబం తరఫునుంచి ఎవరు రాలేదు.