Vishnu Priya : ఇద్దరికీ ఇష్టమైతే ఆ పని చెయ్యచ్చన్న విష్ణుప్రియ బోల్డ్ కామెంట్స్..!

Vishnu Priya : టాలీవుడ్ యాంకర్ విష్ణుప్రియ ఎప్పుడు ఏది మాట్లాడినా అది హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా సూపర్ క్రేజ్ అందుకుంది. సోషల్ మీడియాలో లో యమా యాక్టిివ్ గా ఉంటుంది ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో కూడా తన హాట్ ఫోటో షూట్స్ తో నెటిజన్స్ కు సూపర్ కిక్కుస్తు ఉంటుంది.. విష్ణుప్రియ ఇటీవల సుధీర్ హీరోగా వచ్చిన వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Advertisement
Vishnu Priya open comments on casting couch
Vishnu Priya open comments on casting couch

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియను క్యాస్టింగ్ కౌచ్ గురించి మీడియా అడుగగా.. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ వలన చాలా ఇబ్బంది పడ్డాను. అయితే నేను మాత్రం ఎలాంటి కమిట్మెంట్స్ కు ఒప్పుకోలేదని చెప్పింది. ఒకవేళ ఇద్దరి మధ్య ఇష్టంతో కమిట్మెంట్ జరిగితే దాంట్లో తప్పేముంటుంది.. దానిని తప్పుగా భావించాల్సిన పనిలేద‌ని చెప్పింది విష్ణు.

Advertisement

ఆ విషయంలో ఎవరూ అక్కడ బలవంతం అయితే చేయ‌రు కదా.. అటువంటప్పుడు ఆ విషయాన్ని తప్పుగా ఎందుకు అనుకోవాలి. కానీ అది ఇద్దరికీ ఇష్టం లేకుండా పని జరగటం లేదు కదా అంటూ.. త‌న మనసులోని మాటను బయటపెట్టింది. విష్ణుప్రియ చెప్పిన మాటలను బ‌ట్టి చూస్తే ఇద్ద‌రికి ఇష్టం అయితే కాస్టింగ్ కౌచ్ విష‌యంలో ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని క్లారిటీ ఇచ్చింది.

Advertisement