Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఇటీవల ఆస్కార్ అవార్డు కూడా లభించడంతో ఈ సినిమాలోని నటీనటులు, దర్శకులు కూడా గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. ఇక ఈ సినిమాకు రచయితగా పనిచేసిన విజయేంద్ర ప్రసాదు కూడా భారీ పాపులారిటీ దక్కించుకున్నారు.. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులే కాదు దర్శక నటీనటులు కూడా రాజమౌళి ఎలాంటి సినిమాతో మళ్లీ మన ముందుకు వస్తాడు అని ప్రతి ఒక్కరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోని విజయేంద్ర ప్రసాద్ రచయితగా మహేష్ బాబు మూవీ ని త్వరలోనే రాజమౌళి తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆఫ్రికన్ అడవులలో అడ్వెంచర్స్ మూవీ గా ఉంటుంది అని ఇప్పటికే రచయిత విజయేంద్రప్రసాద్ కూడా వెల్లడించారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మహేష్ బాబు సినిమా చూసేటప్పుడు మీకు ఆర్ఆర్ఆర్ సినిమా ఊహలోకి కూడా రాదు. ఆ సినిమాకు ఈ సినిమాకు అసలు పొంతన కూడా ఉండదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
ముఖ్యంగా మహేష్ బాబు సినీ కెరియర్ లోనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఇదొక అద్భుతమైన కథ.. ఖచ్చితంగా ఆస్కార్ ఆవైపే అడుగులు వేస్తుంది అంటూ విజయేంద్రప్రసాద్ భీమా వ్యక్తం చేశారు.. మొత్తానికైతే ఈ సినిమా ఊహించని దానికంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అని తప్పకుండా సినిమా లవర్స్ కు ఒక అద్భుతమైన సినిమా లభిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసి మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.