Samantha : తాజాగా సమంత మయో సిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు అమెరికాలో చికిత్స పొందిన ఈమె అక్కడ వైద్యం సరిగా లేకపోవడంతో తిరిగి ఇండియాకి వచ్చేసింది. అంత అనారోగ్య పరిస్థితులలో కూడా యశోద సినిమా డబ్బింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ లో కూడా పాల్గొనింది. కానీ మళ్ళీ ఆరోగ్యం క్షీణంచడంతో హైదరాబాదులోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చేరింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె ఇంగ్లీష్ మెడిసిన్స్ కాకుండా నాటువైద్యానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడం తో హుటాహుటిన హాస్పిటల్ సిబ్బంది ఆమెను చెన్నైకి తరలిస్తున్నట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న విజయశాంతి అక్కడే ఉండడంతో వెంటనే సమంతాను చూసి కన్నీటి పర్యంతం అయిందట. అంతేకాదు ఎప్పుడు చలాకీగా హుషారుగా కనిపించే సమంత ఇలా ఒక్కసారిగా బెడ్ పై కనిపించడం నేను తట్టుకోలేక పోతున్నాను.. అసలు సమంతాకు ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది అంటూ కూడా తన అభిప్రాయాన్ని చెబుతూనే కన్నీటి పర్యంతమైందట విజయశాంతి.. విజయశాంతి లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్ కూడా కన్నీటి పర్యంతం అవడంతో అభిమానులు కూడా మరింత దుఃఖం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ గాసిప్స్ రాయుల్లు మాత్రం ఇలాంటి వార్తలను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. సమంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.